ిమంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్/సీనియర్ డీమాన్‌స్ట్రేటర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని కలిపి 76 పోస్టులున్నాయి. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తారు.

{{^htLoading}} {{/htLoading}}
ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జనవరి 2, 2026వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి… ఇంటర్వ్యూలకు పిలుస్తారు. మెరిట్ ఆధారంగా ఫైనల్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇంటర్వ్యూలు జనవరి 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు.
ఎయిమ్స్ మంగళగిరి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ -ఎయిమ్స్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్
- పోస్టులు - సీనియర్ రెసిడెంట్/సీనియర్ డీమాన్‌స్ట్రేటర్స్
- మొత్తం ఖాళీలు - 76 పోస్టులు
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్, ఎంఎస్సీ/ఎంబయోటెక్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
- మొత్తం 30 విభాగాల్లో ఖాళీలున్నాయి.
- అప్లికేషన్ తేదీ చివరి నాటికి 45 ఏళ్లు మించకూడదు.
- దరఖాస్తు రుసుం రూ. 1500(జనరల్), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులకు చివరి తేదీ - 2 జనవరి 2026
- నాన్ మెడికల్ వారికి నెలకు రూ. 56,100, మెడికల్ అభ్యర్థులకు రూ.67,700 జీతం చెల్లిస్తారు.
- ఎంపిక విధానం - ఇంటర్వ్యూలు
- ఇంటర్వ్యూ తేదీలు - 6,8 జనవరి 2026.
- ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం - అడ్మిన్ అండ్ లైబ్రరరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
- ఉదయం 8.30 గంటలకు రిపోర్టింగ్ చేయాలి.
- మెయిల్ - srrecruitment@aiimsmangalagiri.edu.in
- అధికారిక వెబ్ సైట్ - https://www.aiimsmangalagiri.edu.in/
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}