AISSEE 2026 : సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు అక్టోబర్ 30తో ముగియనుండగా… అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.నవంబర్‌ 11, 2025 వరకు గడువు పొడిగించారు.  

Published on: Oct 30, 2025, 21:31:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును అధికారులు పొడిగించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు… నవంబర్ 11వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు
సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు

ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఆరో త‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌ు కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలు…

ప్ర‌వేశ ప‌రీక్ష జ‌న‌వ‌రి 18, 2026 తేదీన నిర్వ‌హిస్తారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.nic.in/r ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, స్టూడెంట్ ఫోటో, సంత‌కం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే…నవంబర్ 12 నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 14వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చు.

ఆరవ తరగతిలో ప్రవేశానికి మొత్తం నాలుగు విభాగాల్లో 125 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. 2:30 గంటల సమయం ఉంటుంది. మైనస్ మార్కులు ఉండవు. మొత్తం సీట్లతో 67% స్థానిక ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు

తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి ఎనిమిదో తరగతి చదువుతూ లేదా పాస్ అయి ఉండాలి వయసు మార్చి 31st 2026 నాటికి 13 నుండి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ ఫస్ట్ 2011 నుండి మార్చి 31st 2013 మధ్య జన్మించిన వారై ఉండాలి.

జ‌న‌ర‌ల్‌, డిఫెన్స్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు అప్లికేషన్ ఫీజు రూ.850 , ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు రూ.700 ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఏపీ, తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలుంటాయి. పరీక్ష పూర్తి అయిన నాలుగు లేదా 6 వారాల లోపు ఫలితాలను ప్రకటిస్తారు.

అర్హత గల విద్యార్థులు https://examinationservices.nic.in/ExamSys2026/ లింక్ తో నేరుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే 011-40759000 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదివచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More