ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు హాజరు అయ్యారు.
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి మోశారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరు అయ్యారు. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు జరిగాయి.
{{^htLoading}} {{/htLoading}}
అంతకుముందు లాలాపేటలోని అందెశ్రీ నివాసం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ వరకు అంతిమయాత్ర జరిగింది. మాజీ ఎంపీలు హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క పాల్గొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
'అందెశ్రీ రాసిన ప్రతీ పాట ప్రజా జీవితంలో నుంచి పుట్టికొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అందెశ్రీ స్తృతీవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రా సాధనలో అందెశ్రీ పాత్ర మరువలేనిదన్నారు. 'రక్తాన్ని చెమటగా, పాటగా మార్చి ప్రజలకు అందించారు. అందెశ్రీది నాది సోదర అనుబంధం. ఆయన లేకపోవడం నాకు వ్యక్తిగతం లోటు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
అందెశ్రీ సోమవారం గుండెపోటుతో మరణించారు. ఇంట్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాష్ రూమ్ దగ్గర పడిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. ఆయన చనిపోయి చాలా సేపు అయిందని వెల్లడించారు.
{{/usCountry}}
{{#usCountry}}
అందెశ్రీ సోమవారం గుండెపోటుతో మరణించారు. ఇంట్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాష్ రూమ్ దగ్గర పడిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. ఆయన చనిపోయి చాలా సేపు అయిందని వెల్లడించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.