...
...
Next Story

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. అందెశ్రీ రాసిన ఈ గొప్ప పాట లిరిక్స్ చూడండి!

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గుండెపోటుతో మరణించారు. ఆయన ఎన్నో గొప్ప పాటలు రాశారు. అందులో మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు పాట అందెశ్రీకి చాలా పేరును తీసుకొచ్చింది. ఆ పాట లిరిక్స్ చూద్దాం..

Published on: Nov 10, 2025, 13:02:22 IST
Advertisement

సహజకవి అందెశ్రీ. మట్టి వాసనలో నుంచి అక్షరాలను పుట్టించిన ప్రజా కవి ఆయన. మాయమైపోతున్నడమ్మా.. పాటతో మనసున్న మనుషుల కోసం వెతికాడు. మనుషులతో కిక్కిరిసిపోయిన ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మంచి మనిషి కోసం ఎంతగానో తపించిపోయాడు. మనిషిలోని మానవత్వం కోసం ఆవేదనతో మాయమైపోతున్నడమ్మా పాట రాశాడు అందెశ్రీ. ఈ పాట లిరిక్స్ ఓసారి చదువుదాం..

అందెశ్రీ
అందెశ్రీ

పల్లవి: మాయమైపోతున్నడమ్మా

మనిషన్నవాడు ఓ….ఓ….ఓ….

మచ్చుకైనా లేడు చూడూ

మానవత్వం వున్నవాడూ

నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు

యాడవున్నాడో కాని క౦టికీ కనరాడు !! మాయమై !!

చరణం: నిలువెత్తుస్వార్ధము నీడలాగొస్తుంటే

చెడిపోకఏమైతడమ్మా

ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల

దిగజారు తున్నడోయమ్మా

అవినీతి పెను ఆశ అంధకారములోన

చిక్కిపోయి రోజు శిధిలమౌతున్నాడు !! మాయమై !!

చరణం: కుక్కనక్కల దైవరూపాలుగా కొలిసి

పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు

చీమలకు చక్కెర పాములకు పాలోసీ

జీవకారుణ్యమే జీవితము అంటాడు

తోడబుట్టిన వాళ్ల ఊరవతలికి నెట్టి

కులమంటు ఇల మీద కలహాల గిరిగీసి !! మాయమై !!

చరణం: అధ్యాత్మికత కున్న అర్ధమె తెలియక

అంధుడై పోతున్నడమ్మా

హిందు ముస్లిం క్రీస్తు సిక్కుపార్శీ నంటూ

తనను తా మరిచేనోయమ్మా

మతము లోకహితము అన్న మాటా మరిచి

మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగౌతు !! మాయమై !!

చరణం: ఇరవై ఐదు పైసల గరు వత్తులు గాల్చీ

అరవై ఐదు కోట్ల వరములడుగూతాడు

దైవాల పేరుతో చందాలకై దంద

భక్తి ముసుగూ తొడిగి భలె ఫోజు బెడతాడు

ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి

చరణం: అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి

చుట్టూ దిరుగూతున్నడమ్మా

రూపాయి కొరకు ఏ పాపానికైతేమి

ఒడిగట్టే నదిగో చూడమ్మా

కోటి విద్యలు కూటి కోసమన్నది బోయి

కోట్లకూ పడుగెత్తా కోరికలు చెలరేగి !! మాయమై !!

చరణం: కండ్ల పొరలగమ్మి కామముతో ఊరేగి

వెకిలి చేష్టల తోటి వేధిస్తు వున్నాడు

కన్నవాళ్లకు రోజు కన్నీల్లె మిగిలించి

కౌగిలే స్వర్గమని కలలు గంటున్నాడు

చీకటైతె చాలు చిత్తుగా తాగేసి

వావి వరుసలు కాస్త మరిచి పోతూ నరుడు !! మాయమై !!

చరణం: పార్టీ సిద్దాంతాల పరగణాలా

గొడవలోన పడి చస్తున్నడమ్మా

ఆధి పత్యపు పోరు అలజడె చిరునామ

అంటు జైకొడుతున్నడమ్మా

రాజకీయాలల్లో రాటు దేలి తుదకు

మానవతా విలువల్ని మంట గలుపుకుంట !! మాయమై !!

చరణం: ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు

కోడిపిల్లై చిక్కికొట్టు కుంటున్నాడు

ఉట్టికి స్వర్గానికంద కుండగ తుదకు

అస్తి పంజరమయ్యి అగుపించనున్నాడు

కదిలె విశ్వం తనా కనుసన్నలో నడువా

కనుబొమ్మ లెగరేసి కాలగమనం లోనా !! మాయమై !!

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe