ఏపీపీ ఉద్యోగ నోటిఫికేషన్ 2025 : డిసెంబర్ 14న ఎగ్జామ్ - TSLPRB ప్రకటన
ఏపీపీ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే ఇందుకు సంబంధించిన పరీక్షల తేదీ ఖరారైంది. డిసెంబర్ 14వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీపీ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా… తాజాగా పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 14వ తేదీన పేపర్ 1, 2 పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 118 ఖాళీలను భర్తీ చేస్తారు. మల్టీజోన్ల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఇక అదేరోజు మధ్యా హ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు డిస్క్రిప్టివ్ విధానంలో 200 మార్కులకు రెండో పేపర్ పరీక్ష ఉంటుంది.
ఈ పరీక్షలను హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 118 పోస్టులకు 3,132 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పురుషులు 1,908…. మహిళలు 1,224 మంది అభ్యర్థులు ఉన్నారు. https://www.tgprb.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు.
ఏపీపీ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన - పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, తెలంగాణ.
- పోస్టులు - అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)
- మొత్తం ఖాళీలు - 118 (మల్టీజోన్ 1 - 50 ఖాళీలు మల్టీ జోన్ 2 -68 ఖాళీలు)
- అర్హతలు - లా డిగ్రీ కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ మెంట్ తప్పనిసరి. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి.
- జీతం - నెలకు రూ.54,220- రూ.1,33,630
- ఎంపిక విధానం - రాత పరీక్ష ఉంటుంది. పేపర్ -1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉండగా.. పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు)
- పేపర్ 1 - 200 మార్కులకు ఉండగా… పేపర్ -2 కూడా 200 మార్కులకుగానూ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు
- అధికారిక వెబ్ సైట్ - https://www.tgprb.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

