Raidurgam Hit and Run Case : హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన హిట్ అండ్ రన్ కేసులో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రముఖ టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేగంగా వచ్చిన ఆటోమొబైల్ వాహనంతో ఢీకొట్టడంతో…. ఒకరి మృతితో పాటు మరొకరు తీవ్రంగా గాయపడటానికి కారణమైనందుకు సందీప్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగింది…?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31, 2026 నాడు తెల్లవారుజామున 4:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాజాగూడలోని అంకుర ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది.
సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక గుర్తుతెలియని పాదాచారి (బాటసారి) అంకుర ఆసుపత్రి వైపుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో నానక్‌రామ్‌గూడ ఓఆర్ఆర్ రోటరీ వైపు నుంచి ఖాజాగూడ దిశగా అతివేగంగా… నిర్లక్ష్యంగా వచ్చిన ఇన్నోవా క్రిస్టా వాహనం (నంబర్ TS09EW7700) ఆ పదాచారిని బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే, మానవత్వంతో స్పందించిన ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీ (21), మరొక వ్యక్తి కలిసి… తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఖాజాగూడ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ ఓఆర్ఆర్ రోటరీ వైపు అతివేగంగా దూసుకొచ్చిన రెండు వేర్వేరు కార్లు…. రోడ్డుపై ఉన్న పాదాచారితో పాటు అతనికి సాయం చేస్తున్న ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీని కూడా బలంగా ఢీకొట్టి ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాయి.
ఈ ప్రమాదంలో పాదాచారి తీవ్రమైన శరీర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీ కుడి కాలు విరిగిపోవడంతో పాటు శరీరమంతా తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}ఈ ప్రమాదంలో పాదాచారి తీవ్రమైన శరీర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీ కుడి కాలు విరిగిపోవడంతో పాటు శరీరమంతా తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}సంఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పరారైన వాహనాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా గుర్తించారు.
"ప్రమాదానికి కారణమైన నిందితుడు సందీప్‌ను మేము అదుపులోకి తీసుకున్నాం. ఆయన వినియోగించిన మహీంద్రా XUV ఎలక్ట్రిక్ కారును కూడా సీజ్ చేశాం. ఈ హిట్ అండ్ రన్ వ్యవహారంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నాం," అని రాయదుర్గం పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నారు.