Hyderabad : గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో కూలిన శిక్షణ విమానం

హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా - 152 శిక్షణ విమానం చెట్టుపై కూలింది. ఈ ఘటనలో స్టూడెంట్ పైలట్‌కు తలకు గాయమైంది.

Published on: Nov 26, 2026, 18:38:52 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ శిక్షణ విమానం అత్యవసరంగా కిందకు దిగింది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 (VT-YOU) విమానం ఈ ఘటనకు గురికాగా…. ఒక చెట్టుపై కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో స్టూడెంట్ పైలట్, ఒక ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారు.

కూలిన ట్రైనింగ్ విమానం (Sourced)
కూలిన ట్రైనింగ్ విమానం (Sourced)

స్టూడెంట్ పైలట్‌కు చికిత్స

ఈ ఘటనలో స్టూడెంట్ పైలట్ తలకు గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. తలకు కుట్లు వేసినట్లు సమాచారం. మరోవైపు విమానంలోని ఇన్‌స్ట్రక్టర్ సురక్షితంగా బయటపడ్డారు.

విమానం అత్యవసరంగా కిందకు దిగడానికి దారితీసిన పరిస్థితులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ చేపట్టే అవకాశం ఉంది. సాంకేతిక కారణాలు లేదా ఇతర అంశాలపై నిపుణులు పరిశీలన జరిపే వీలుంది.

ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. సైన్యాధికారులతో సమన్వయం చేసుకుంటూ వివరాలను పరిశీలిస్తున్నట్లు ఒక పోలీసు అధికారి ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.

"ఈ విషయంపై మాకు సమాచారం అందింది. మేము వివరాలను పరిశీలిస్తున్నాం, సైన్యాధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. మరిన్ని వివరాలను త్వరలో పంచుకుంటాం," అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.