...
...
Next Story

బీడీఎల్ హైదరాబాద్‌లో 156 అప్రెంటీస్ ఖాళీలు.. ఎలా అప్లై చేయాలి?

హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌ యూనిట్‌లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్‌)లో అప్రెంటీస్ ట్రెయినీ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Nov 25, 2025, 13:22:40 IST
Advertisement

భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 156 అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక బీడీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 08-12-2025 నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీలు పంపించడానికి చివరి తేదీ 12.12.2025గా ఉంది.

ఖాళీల వివరాలు

బీడీఎల్ అప్రెంటీస్ ఖాళీలు
బీడీఎల్ అప్రెంటీస్ ఖాళీలు

ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 30, మెషినిస్ట్ 15, మెషినిస్ట్ గ్రైండర్ 02, మెకానిక్ డీజిల్ 05, మెకానిక్ R & Ac 05, టర్నర్ 15, వెల్డర్ 04 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. మెుత్తం ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఐటీఐ) 156 ఖాళీలు.

అర్హతలు

అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయనికి వస్తే.. కనీస వయసు 14 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. వివిధ ట్రేడ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా విడిగా తీసుకుంటారు.

అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన అర్హత ప్రకారం సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి ట్రేడ్‌కు ఒక సాధారణ మెరిట్ జాబితా తయారు చేస్తారు. 10వ తరగతి/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత, ఐటీఐ ఉత్తీర్ణతకు సమాన మార్కులకు వెయిటేజ్ ఇస్తారు. ఎంపిక విధానం విద్యార్హతలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా చేస్తారు.

ఇలా అప్లై చేయాలి

అభ్యర్థులు https://apprenticeshipindia.gov.in/candidate-registration లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కాపీ, పదో తరగతి, ఐటీఐ మార్కుల షీట్, కుల ధ్రువీకరణ పత్రం హార్ట్ కాపీలను పోస్ట్ ద్వారా మేనేజర్(హెచ్ఆర్) అప్రెంటీస్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కాంచన్‌బాగ్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలి. పోస్ట్ ద్వారా అందుకున్న హార్ట్ కాపీలు మాత్రమే బీడీఎల్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 18వ తేదీ కాగా.. హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ డిసెంబర్ 12గా నిర్ణయించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe