తాను పార్టీ మారుతున్నానంటూ కొంతమంది అనవసరమైన పోస్టర్ లు వేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి 5 ఏళ్ల అవుతుందని… ఆ తర్వాత బీజేపీలో చేరానని గుర్తు చేశారు. పార్టీలు మారడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు.

“నా గురుంచి తెలంగాణ సమాజానికి తెలుసు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఈటలను పొగుట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో ఈటల.. కేసీఆర్ తో కలుస్తారు అని కొందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయవద్దని చెబుతున్నాను. నాడు నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులు గురిచేశారు. ఆయన చేయని పనిలేదు. కోళ్ళ ఫార్మ్ లు కూల్చారు... భూములు గుంజుకున్నారు” అని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
ఆహ్వానించినా వెళ్లలేదు - ఈటల
“అధికారం కోసం ఆధిపత్యం కోసం ఇతర పార్టీల నుండి వస్తారు అంటారు. నన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఆహ్వానించారు. కోరుకున్న మంత్రిపదవి ఇస్తా అన్నారు. కానీ కమిట్మెంట్ తో ఉద్యమంలో ఉన్నా. కేసీఆర్ పై పోరాటంలో భాగంగా కాంగ్రెస్ లోకి వెళ్లి ఉంటే మంత్రినో లేదా డిప్యూటీ సీఎంనో అయ్యే వాడిని. నేను పదవుల కోసం పాకులాడను” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
నా పార్టీ ఏమీ ఆలొచిస్తుందో… అదే నేను కూడా ఆలోచిస్తానని ఈటీల చెప్పారు. మా నియోజకవర్గాల్లోని సమస్యలతో పాటు CSR నిధుల పై కూడా ప్రధాని కి లేఖ రాశామన్నారు. అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గెలిచారని… అబద్ధాల పునాదుల మీదనే అయన పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
{{/usCountry}}నా పార్టీ ఏమీ ఆలొచిస్తుందో… అదే నేను కూడా ఆలోచిస్తానని ఈటీల చెప్పారు. మా నియోజకవర్గాల్లోని సమస్యలతో పాటు CSR నిధుల పై కూడా ప్రధాని కి లేఖ రాశామన్నారు. అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గెలిచారని… అబద్ధాల పునాదుల మీదనే అయన పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
{{/usCountry}}ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. మీడియాను మేనేజ్ చేస్తున్నారని… ఈ ప్రభుత్వం బుకాయిస్తు, దాబాయిస్తుందని విమర్శించారు. 6 మంది ఎంపీతో పాటు ఎమ్మెల్యేలం కలిసి కార్యక్రమాలు చేయబోతున్నామని ప్రకటించారు. GHMC పరిధిలో జరిగే ఎన్నికల్లో సర్వే లు చేస్తున్నామని… బీజేపీ సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు.