Tummidihatti Barrage : ‘తుమ్మిడిహెట్టి’ బ్యారేజీ వివాదంపై కదలిక - సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక భేటీ..!

Tummidihatti Barrage : తుమ్మిడిహట్టి బ్యారేజ్ వివాదం పరిష్కారానికి అడుగు ముందుకు పడింది. సెప్టెంబర్ 1న సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.

Published on: Aug 28, 2026, 09:14:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tummidihatti Barrage : ఉమ్మడి ఆదిలాబాద్‌ సహా తెలంగాణలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంలో చాలా కాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన ఈ బ్యారేజ్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబర్ 1న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

‘తుమ్మిడిహెట్టి’పై కదలిక - ఢిల్లీలో కీలక భేటీ
‘తుమ్మిడిహెట్టి’పై కదలిక - ఢిల్లీలో కీలక భేటీ

సెప్టెంబర్ 1న కీలక భేటీ…

ఢిల్లీలోని సేవా భవన్‌లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.

సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం జరిపిన సంప్రదింపుల ఫలితంగానే కేంద్రం ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది.

పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ వ్యవహారాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. అనంతరం, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రత్యేక లేఖ రాశారు.

ఎత్తుపైనే పీటముడి…!

  • తెలంగాణ ప్రతిపాదన : తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ను 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
  • మహారాష్ట్ర వైఖరి : మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే అంగీకారం తెలిపింది.

బ్యారేజ్ ఎత్తును 148 మీటర్లకే పరిమితం చేస్తే, గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా అవసరమైన నీటిని తరలించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగి రాష్ట్ర ఖజానాపై విపరీతమైన ఆర్థిక భార పడుతుందని వివరించింది. పరిశోధనల మద్దతుతో తెలంగాణ వాదనఎత్తు పెంచడం వల్ల ముంపు ప్రాంతం పెరుగుతుందన్న మహారాష్ట్ర అభ్యంతరాల పైనా తెలంగాణ వద్ద స్పష్టమైన పరిష్కారం ఉంది.

నీటి మట్టాన్ని 152 మీటర్లకు పెంచడం ద్వారా ఏర్పడే అదనపు ముంపు ప్రభావాన్ని తగ్గించవచ్చని కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధనా సంస్థ (సిడబ్ల్యూపిఆర్‌ఎస్) నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేసినట్లు సీఎంఓ పేర్కొంది.సెప్టెంబర్ 1న జరిగే ఈ భేటీ ద్వారా ఇరు రాష్ట్రాలు ఒకే వేదికపైకి వచ్చి సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొంటాయని… ఫలితంగా తెలంగాణలోని వెనుకబడిన, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More