తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం - రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్‌పోస్టులు మూసివేత
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సీఎం ఆదేశాల మేరకు రవాణశాఖ కమిషనర్ వెంటనే ఉత్తర్వులు ఇచ్చారు. చెక్‌పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీవోలకు ఆదేశాలు అందాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్… డీటీఓలకు ఆదేశాలు విడుదల చేశారు.

బారికేడ్లు తొలగింపు…
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టులు మూసి వేయబడినట్టుగా కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు.
ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచిస్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను తక్షణం తొలగించాలని డీటీఓలకు సూచించారు. ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని చెప్పారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలనకు సంబంధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీటీవో కార్యాలయంలో భద్రపరచాలని ఆదేశించారు.
ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిజానికి చాలా కాలంగా రవాణా చెక్ పోస్టుల వద్ద తీవ్రస్థాయిలో అక్రమ వసూళ్ల దందా సాగుతుందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ఏడాది జులై ఆఖరి వారంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ… వెంటనే జీవో జారీ కాలేదు. నెల రోజుల తర్వాత జీవో జారీ ఇచ్చినప్పటికీ తొలగింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ విషయంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి… వెంటనే క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఇదే విషయంపై కమిషన్ కు ఆదేశాలివ్వటంతో…. ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వీటిని తొలగించే పనిలో అధికారులు పడ్డారు. ఇవాళ సాయంత్రం కల్లా వీటిని తొలగించే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

