...
...
Next Story

బనకచర్ల ప్రాజెక్ట్ : 'మా ప్రయోజనాలు వదులుకోం... ఏ అన్యాయాన్నీ సహించం' - సీఎం రేవంత్ రెడ్డి

బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బనకచర్లపై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Published on: Jun 18, 2025 10:53 PM IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి… మీడియాతో మాట్లాడారు.

బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్
బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్

బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి… తెలంగాణ హక్కులను రక్షించే పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు సూచించారు. తెలంగాణపై జరిగే ఏ అన్యాయాన్నీ సహించమని స్పష్టం చేశారు.

కలిసికట్టుగా ముందుకు వెళ్తాం - సీఎం రేవంత్

“మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రకటించారు. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు” అని సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు.

“మా ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కేసీఆర్చేసిన ద్రోహం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టులు పూర్తిగా కడితే వరద ఎంత వస్తుందో తెలిసేది.. మోడీకి చంద్రబాబు.. చంద్రబాబుకు మోడీ అవసరం ఉంది. అధికారం మీకు, నీళ్లు మాకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మోదీ మీరు చెబితే వినొచ్చు.. కానీ, మా ప్రయోజనాలు వదులుకోం. మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మిగులు జలాలు 3 వేల టీఎంసీల నీళ్లు ఉంటే మా వాటా వాడుకునేందుకు క్లియర్‌ చేయండి.. గోదావరిలో మా హక్కుగా ఉన్న 968 టీఎంసీల వినియోగానికి అనుమతించండి. మేం మా వాటాను వాడుకున్నాక.. మీ నీరును మీరు వాడుకోండి” అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

మరోవైపు ఎంపీల అఖిలపక్ష సమావేశం నుంచి బీఆర్ఎస్‌ వాకౌట్‌ చేసింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయంగా మాట్లాడుతున్నారంటూ రవిచంద్ర వెళ్లిపోయారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe