2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Published on: Nov 9, 2025, 15:57:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. పదేళ్ల పాలనలో సగటున రూ. 2 లక్షల కోట్ల వార్షిక ఆదాయం ఆర్జించినప్పటికీ, హైదరాబాద్‌లోని కొన్ని ఫ్లైఓవర్‌లతో సహా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి(ఫైల్ ఫొటో)
సీఎం రేవంత్ రెడ్డి(ఫైల్ ఫొటో)

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమలను గుజరాత్‌కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సెమీ కండక్టర్ల కంపెనీని ఆ రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

'1994 నుండి 2004 వరకు టీడీపీ 10 సంవత్సరాలు పాలించింది, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ (అప్పటి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. 2014 నుండి బీఆర్ఎస్ తెలంగాణను దాదాపు 10 సంవత్సరాలు పాలించింది, మళ్ళీ 2024 నుండి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇదే ప్రజల తీర్పు.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. బిజెపి డిపాజిట్ కోల్పోతుందని, బీఆర్ఎస్ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పథకాలను ఏవీ నిలిపివేయలేదని, కొన్నింటిని విస్తరించామన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్యకు పాల్పడి బీజేపీకి తన అవయవాలను దానం చేసిందని కామెంట్ చేశారు సీఎం రేవంత్. 2024లో కాషాయ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 'బీఆర్ఎస్‌ను బీజేపీతో విలీనం చేయడం ప్రారంభమైందని కేసీఆర్ కుమార్తె స్వయంగా చెబుతోంది. బీఆర్ఎస్‌కు గతం మాత్రమే ఉంది. దానికి భవిష్యత్తు లేదు. దాని 25 ఏళ్ల జీవితం ముగిసింది.' అని సీఎం అన్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఓటర్లను తన పార్టీకి మద్దతు ఇవ్వమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు విజ్ఞప్తి చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి జనాభా గణనను విజయవంతంగా నిర్వహించిందని, కేంద్రం తెలంగాణ నమూనాను అనుసరిస్తుందని చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 శాతం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు స్థాపించినట్టుగా తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More