...
...
Next Story

రెవెన్యూ శాఖను సంస్కరించకపోతే ఈ దేశం బాగుపడదు : హైకోర్టు కామెంట్స్

రాష్ట్రంలో చెరువులకు ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్‌టీఎల్) నిర్ణయించకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఏది ఎఫ్‌టీఎల్.. ఏది పట్టా భూమిఅనే విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపింది.

Published on: Nov 6, 2025, 07:00:54 IST
Advertisement

మిషన్ కాకతీయ ప్రాజెక్టులో ప్రైవేట్ పట్టా భూములను సరైన ప్రక్రియ లేకుండా చేర్చినందుకు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులను మందలించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లాల గ్రామానికి చెందిన బోనం సంజీవ రెడ్డి అనే రైతు, మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

పిటిషనర్లు పేర్కొన్న సర్వే నంబర్‌ 29 పూర్తిగా చెరువు మధ్యలో ఉందని, చెరువు మధ్యలో పట్టాలు ఎలా ఇస్తారు అని హైకోర్టు ప్రశ్నించింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలో ఎఫ్‌టీఎల్ నిర్ణయించని కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవులే బాధ్యులు, దీనికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అని జస్టిస్ అనిల్ కుమార్ జుకుంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెవెన్యూ శాఖను సంస్కరించకపోతే దేశం బాగుపడదని న్యాయమూర్తి అన్నారు. ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఖమ్మం కలెక్టర్‌ను ఆదేశించారు.

కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే అదనపు కోర్టు చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరింది కోర్టు. విచారణను వారం రోజుల పాటు వాయిదా వేశారు.

నవంబర్ 4న జరిగిన విచారణ సందర్భంగా.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ పట్టా భూమిని సేకరించకుండా లేదా యజమానికి నోటీసులు జారీ చేయకుండా ప్రాజెక్టులో భాగంగా తీసుకున్నారని వాదించారు. ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగ నిబంధనలు, సహజ న్యాయం సూత్రాలకు విరుద్ధమని, పిటిషనర్ల భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిరోధించాలని కోర్టును కోరారు.

ప్రైవేట్ భూమిని అధికారులు ఎలా నిర్ణయించగలరని న్యాయమూర్తి ప్రశ్నించారు. FTL సరిహద్దులపై స్పష్టత లేకపోవడం వల్ల అనేక పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. 37 ఎకరాల చెరువు పరిధిలోని 27 ఎకరాల పట్టా భూమిని క్లెయిమ్ చేసిన కేసును గుర్తు చేస్తూ.. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల చర్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks