ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ను నడుపుతున్న తొమ్మిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నిందితులుగా ప్రవీణ్, ప్రకాష్ ఉండగా…. కాల్ సెంటర్ లో పనిచేయడానికి కోల్ కతా నుండి సిబ్బందిని తీసుకువచ్చినట్లు తేలింది.
కోల్ కత్తా నుంచి టెలీకాలర్లు…

సైబరాబాద్ పోలీసులు శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం…. వీరంతా ఆస్ట్రేలియా పౌరులకు కాల్ చేసి వారి బ్యాంకు ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును కాజేసినట్లు గుర్తించారు. ఇందుకోసం పెద్ద వ్యవస్థనే సెట్ చేశారు. కోల్‌కతాకు చెందిన మౌమిత మండల్(27), ఇజాజ్ అహ్మద్(42), సంబిత్‌రాయ్(27), శనిక్ బెనర్జీ(24), మౌమిత మల్లిక్(33), శిల్పి సమద్దర్(33), కునాల్‌సింగ్(37)లను టెలీకాలర్లుగా నియమించుకున్నారు.
ముందుస్తు ప్లాన్ లో భాగంగా ఆస్ట్రేలియా పౌరుల మెయిల్ ఐడీలు, ఇతర వివరాలను సేకరించేవారు. వారికి నకిలీ మెయిల్స్ పంపేవారు. కంప్యూటర్ హ్యాక్ అయిందని… సమస్య క్లియర్ కావటానికి ఈ నెంబర్ ను సంప్రదించాలని పేర్కొనేవారు. ఆ నంబరుకు ఫోన్ చేస్తే… మాటల్లో పెట్టి వారి కంప్యూటర్ ను కనెక్ట్ చేసుకోవటానికి ఏనీ డెస్క్ వివరాలను తీసుకుంటారు. ఇదే అదునుగా వారి కంప్యూటర్లలోని బ్యాంకు ఆన్‌లైన్ లాగిన్ ఐడీలు సేకరించి డబ్బు బదిలీ చేసుకునేవారు. ఇలా ఈ రెండేళ్లలో రూ.8-10 కోట్ల వరకూ కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బాలానగర్ ఎస్ వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందగా…. శనివారం రోజు వీరి ఆఫీస్ పై సోదాలు చేశారు. ప్రవీణ్, ప్రకాశ్ మినహా మిగిలిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ సుధీంద్ర తెలిపారు.
సేకరించిన డబ్బులను హవాలా, క్రిప్టోకరెన్సీ, ఇతర రహస్య మార్గాల ద్వారా.. భారత్ లోని బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలిసింది. తొమ్మిది మందిని అరెస్టు చేయగా… మరికొందర్నీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆఫీస్ లోని 12 కంప్యూటర్లను కూడా సీజ్ చేశారు.
{{/usCountry}}సేకరించిన డబ్బులను హవాలా, క్రిప్టోకరెన్సీ, ఇతర రహస్య మార్గాల ద్వారా.. భారత్ లోని బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలిసింది. తొమ్మిది మందిని అరెస్టు చేయగా… మరికొందర్నీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆఫీస్ లోని 12 కంప్యూటర్లను కూడా సీజ్ చేశారు.
{{/usCountry}}