ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్..! హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ 'ఫేక్ కాల్ సెంటర్', వెలుగులోకి కీలక విషయాలు

ఆస్ట్రేలియా దేశ పౌరుల్ని మోసగిస్తున్న అంతర్జాతీయ నకిలీ కాల్‌ సెంటర్‌ గుట్టును సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆస్ట్రేలియన్లకు ఇక్కడినుంచి నకిలీ ఈ-మెయిల్స్‌ పంపించి డబ్బులు కాజేస్తున్నట్లు గుర్తించారు. 9 మందిని అరెస్ట్ చేశారు.

Published on: Nov 30, 2025, 09:20:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ను నడుపుతున్న తొమ్మిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నిందితులుగా ప్రవీణ్, ప్రకాష్ ఉండగా…. కాల్ సెంటర్ లో పనిచేయడానికి కోల్ కతా నుండి సిబ్బందిని తీసుకువచ్చినట్లు తేలింది.

కాల్‌సెంటర్‌ ముఠా గుట్టురట్టు
కాల్‌సెంటర్‌ ముఠా గుట్టురట్టు

కోల్ కత్తా నుంచి టెలీకాలర్లు…

సైబరాబాద్ పోలీసులు శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం…. వీరంతా ఆస్ట్రేలియా పౌరులకు కాల్ చేసి వారి బ్యాంకు ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును కాజేసినట్లు గుర్తించారు. ఇందుకోసం పెద్ద వ్యవస్థనే సెట్ చేశారు. కోల్‌కతాకు చెందిన మౌమిత మండల్‌(27), ఇజాజ్‌ అహ్మద్‌(42), సంబిత్‌రాయ్‌(27), శనిక్‌ బెనర్జీ(24), మౌమిత మల్లిక్‌(33), శిల్పి సమద్దర్‌(33), కునాల్‌సింగ్‌(37)లను టెలీకాలర్లుగా నియమించుకున్నారు.

ముందుస్తు ప్లాన్ లో భాగంగా ఆస్ట్రేలియా పౌరుల మెయిల్ ఐడీలు, ఇతర వివరాలను సేకరించేవారు. వారికి నకిలీ మెయిల్స్ పంపేవారు. కంప్యూటర్‌ హ్యాక్‌ అయిందని… సమస్య క్లియర్ కావటానికి ఈ నెంబర్ ను సంప్రదించాలని పేర్కొనేవారు. ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే… మాటల్లో పెట్టి వారి కంప్యూటర్ ను కనెక్ట్ చేసుకోవటానికి ఏనీ డెస్క్ వివరాలను తీసుకుంటారు. ఇదే అదునుగా వారి కంప్యూటర్లలోని బ్యాంకు ఆన్‌లైన్‌ లాగిన్‌ ఐడీలు సేకరించి డబ్బు బదిలీ చేసుకునేవారు. ఇలా ఈ రెండేళ్లలో రూ.8-10 కోట్ల వరకూ కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బాలానగర్ ఎస్ వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందగా…. శనివారం రోజు వీరి ఆఫీస్ పై సోదాలు చేశారు. ప్రవీణ్, ప్రకాశ్‌ మినహా మిగిలిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ సుధీంద్ర తెలిపారు.

సేకరించిన డబ్బులను హవాలా, క్రిప్టోకరెన్సీ, ఇతర రహస్య మార్గాల ద్వారా.. భారత్ లోని బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలిసింది. తొమ్మిది మందిని అరెస్టు చేయగా… మరికొందర్నీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆఫీస్ లోని 12 కంప్యూటర్లను కూడా సీజ్ చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More