...
...
Next Story

తెలంగాణపై విరుచుకుపడిన మెుంథా.. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు!

తెలంగాణపై మెుంథా తుపాను భారీగా ప్రభావం చూపింది. పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అయ్యాయి. నేడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Published on: Oct 30, 2025, 05:53:57 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం దాటిన మెుంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం చాలా ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. బుధవారం సాయంత్రం వరకూ వర్షం పడుతూనే ఉంది. దీంతో వాగులు వంకల్లో భారీగా వరద నీటి ప్రవాహం కనిపించింది. ఇక పలు జిల్లాల్లో కుండపోత వాన పడింది.

తెలంగాణ వర్షాలు
తెలంగాణ వర్షాలు

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లెలో ఉదయం 8:30 నుండి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా 41.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. తరువాత వరంగల్ జిల్లాలోని కల్లెడ 34.8 సెం.మీ, రెడ్లవాడ 333.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

భారత వాతావరణ శాఖ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు బుధవారం రాత్రి నుంచి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేటతోపాటుగా మరిన్ని జిల్లాల్లో కూడా గట్టిగా వానలు పడనున్నాయి. అక్టోబర్ 30వ తేదీన కూడా ఈ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. వీటితోపాటుగా పలు జిల్లాల్లో కూడా సెలవు ఉన్నాయి.

తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావాన్ని, పంట నష్టాలను తగ్గించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో సమన్వయంతో సహాయ, సహాయ కార్యకలాపాలను చేపట్టాలని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిశితంగా పరిశీలించాలని నీటిపారుదల శాఖకు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe