తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం(ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న(జూన్ చివరి వారంలో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సభకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులను ఆదేశించింది.
వానాకాలం పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించేందుకు ప్రభుత్వం నిధుల సమీకరణను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మందికి పైగా రైతులకు ఈ విడతలో లబ్ధి చేకూరనుంది. గతంలో 1.4 కోట్ల ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందేది. అయితే, ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వేలో దాదాపు 5 లక్షల ఎకరాల భూమి అసలు సాగులోనే లేదని (వ్యవసాయేతర భూములు, కొండలు, గుట్టలు మొదలైనవి) తేలింది.
ఈ నేపథ్యంలో కేవలం నిజమైన సాగు భూములైన సుమారు 1.35 కోట్ల ఎకరాలకు మాత్రమే ఈ విడతలో రైతు భరోసా నిధులు అందే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఎకరానికి రూ.6,000 చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో నాణ్యమైన సన్నరకాల వరి సాగును ప్రోత్సహించడంతో పాటు, రైతులు పండించిన పంటను పౌరసరఫరాల సంస్థ ద్వారా సజావుగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
{{/usCountry}}మరోవైపు రాష్ట్రంలో నాణ్యమైన సన్నరకాల వరి సాగును ప్రోత్సహించడంతో పాటు, రైతులు పండించిన పంటను పౌరసరఫరాల సంస్థ ద్వారా సజావుగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
{{/usCountry}}రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ కమిటీలో కీలక అధికారులకు చోటు కల్పించారు. ఛైర్మన్‌గాసురేంద్రమోహన్ (రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి), సభ్యులు స్టీపెన్ రవీంద్ర (పౌరసరఫరాల శాఖ కమిషనర్), ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య (వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ), దత్తమ్ (ఆర్థిక, అర్థగణాంక శాఖ డైరెక్టర్), సభ్య కన్వీనర్ గోపి (రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు)గా ఉన్నారు.
ఈ కమిటీ క్షేత్రస్థాయిలో నాణ్యమైన సన్నరకాల విత్తనాల సరఫరాను పర్యవేక్షిస్తుంది. పంటల సాగు విధానాన్ని పరిశీలిస్తూ, ఐకేపీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు కొనుగోళ్లు జరిగేలా నిరంతరం పర్యవేక్షించనుంది.