రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. మరికొన్ని రోజుల్లోనే అన్నదాతల అకౌంట్‌లోకి డబ్బులు
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మరికొన్ని రోజుల్లో అన్నదాతల అకౌంట్‌లోకి డబ్బులు రానున్నాయ్.
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం(ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న(జూన్ చివరి వారంలో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సభకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులను ఆదేశించింది.
వానాకాలం పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించేందుకు ప్రభుత్వం నిధుల సమీకరణను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మందికి పైగా రైతులకు ఈ విడతలో లబ్ధి చేకూరనుంది. గతంలో 1.4 కోట్ల ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందేది. అయితే, ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వేలో దాదాపు 5 లక్షల ఎకరాల భూమి అసలు సాగులోనే లేదని (వ్యవసాయేతర భూములు, కొండలు, గుట్టలు మొదలైనవి) తేలింది.
ఈ నేపథ్యంలో కేవలం నిజమైన సాగు భూములైన సుమారు 1.35 కోట్ల ఎకరాలకు మాత్రమే ఈ విడతలో రైతు భరోసా నిధులు అందే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఎకరానికి రూ.6,000 చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో నాణ్యమైన సన్నరకాల వరి సాగును ప్రోత్సహించడంతో పాటు, రైతులు పండించిన పంటను పౌరసరఫరాల సంస్థ ద్వారా సజావుగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ కమిటీలో కీలక అధికారులకు చోటు కల్పించారు. ఛైర్మన్‌గాసురేంద్రమోహన్ (రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి), సభ్యులు స్టీపెన్ రవీంద్ర (పౌరసరఫరాల శాఖ కమిషనర్), ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య (వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ), దత్తమ్ (ఆర్థిక, అర్థగణాంక శాఖ డైరెక్టర్), సభ్య కన్వీనర్ గోపి (రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు)గా ఉన్నారు.
ఈ కమిటీ క్షేత్రస్థాయిలో నాణ్యమైన సన్నరకాల విత్తనాల సరఫరాను పర్యవేక్షిస్తుంది. పంటల సాగు విధానాన్ని పరిశీలిస్తూ, ఐకేపీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు కొనుగోళ్లు జరిగేలా నిరంతరం పర్యవేక్షించనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


