వికారాబాద్ : ప్రేమ పెళ్లి కోసం దారుణం - తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన కుమార్తె..!

వికారాబాద్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులకు కుమార్తె మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి హత్యకు పాల్పడింది. ఈ కేసులో కీలక విషయాలు బయటికొచ్చాయి.

Published on: Jan 28, 2026, 16:33:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వికారాబాద్‌ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కుమార్తె…. ఏకంగా తల్లిదండ్రులను హత్య చేసింది. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించినా.. పోలీసుల విచారణలో కుమార్తె బండారం బట్టబయలైంది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటికొచ్చాయి.

representative image (image source pixel)
representative image (image source pixel)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే వేర్వురు కులాలు కావటంతో… తల్లిదండ్రులు వివాహనికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మరో యువకుడితో సురేఖకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. దీంతో తల్లిదండ్రులపై కుమార్తె సురేఖ కక్ష పెంచుకుంది. ఎలాగైనా వాళ్లను అడ్డు తొలగించుకోవాలని భావించింది.

తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుంచి పలు రకాల ఇంజెక్షన్లు తీసుకొచ్చింది. ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి ఎక్కువ డోసేజ్ మత్తు మందు కలిగిన ఇంజెక్షన్లు తల్లిదండ్రులకు ఇచ్చింది. తల్లిదండ్రులు మరణించిన అనంతరం…. ఇద్దరినీ ఇంట్లో ఒకే చోట పడుకోబెట్టింది.ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సోదరుడు అశోక్‌కు ఫోన్‌ చేసి తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారని చెప్పింది.

ఈ విషయంపై అన్న అశోక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… అక్కడ కొన్ని ఇంజెక్షన్లు గుర్తించారు. వెంటనే కుమార్తె తీరుపై అనుమానాలు బలపడగా… తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో తానే హత్య చేశానని సురేఖ అంగీకరించింది.కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 24వ తేదీన ఈ ఘటన జరగగా… కుమార్తెనే తల్లిదండ్రులను హత్య చేసినట్లు తేలటంతో స్థానికంగా సంచలనంగా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More