...
...
Next Story

రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో చర్లపల్లి- గోరఖ్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు!

ఝాన్సీ స్టేషన్‌లో ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్లపల్లి-గోరఖ్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Published on: Sep 9, 2026, 11:01:30 IST
Advertisement

హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ అందించింది. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 'విజిఎల్ ఝాన్సీ' (VGL Jhansi) రైల్వే స్టేషన్‌లో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఫలితంగా ఆ మార్గంలో నడిచే చర్లపల్లి - గోరఖ్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినున్నారు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ (image source @GMSRailway)
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ (image source @GMSRailway)

నవంబర్, డిసెంబర్ నెలల్లో వేర్వేరు తేదీల్లో బయలుదేరే ఈ సర్వీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది.

చర్లపల్లి – గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు - 22075) :

  • చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఈ రైలు 2026 నవంబర్ 20, 27 తేదీలతో పాటు, డిసెంబర్ 4, 11, 18 మరియు 25 తేదీలలో బయలుదేరే సర్వీసులు క్రమబద్ధీకరించిన పాత మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తాయి.
  • ప్రత్యామ్నాయ మార్గం : ఇటార్సి - జబల్‌పూర్ - హమీర్‌పూర్ రోడ్ - కాన్పూర్ సెంట్రల్ మీదుగా ఈ రైలు నడుస్తుంది.

గోరఖ్‌పూర్ – ఛార్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 22076)

  • తిరుగు ప్రయాణంలో గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లికి వచ్చే ఈ రైలు 2026 నవంబర్ 22, 29 తేదీలతో పాటు, డిసెంబర్ 6, 13, 20 మరియు 27 తేదీల్లో బయలుదేరే సర్వీసులను దారి మళ్లిస్తారు .
  • ప్రత్యామ్నాయ మార్గం : కాన్పూర్ సెంట్రల్ - హమీర్‌పూర్ రోడ్ - జబల్‌పూర్ - ఇటార్సి మీదుగా ఈ రైలు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రెండు మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు మళ్లించిన రూట్ల సమాచారాన్ని, రైళ్ల రాకపోకల సమయాలను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైలు వేళలు, ఆగు స్టేషన్ల పూర్తి వివరాల కోసం ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks