TGSPDCL Power Bill Calculation : మీ కరెంట్ బిల్లు మీకు పూర్తిగా అర్థమవుతుందా..? వీటిపై ఓ లుక్కేయండి
TGSPDCL Power Bill Charges Calculation : TGSPDCL వినియోగదారులకు ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసింది. కరెంట్ బిల్లులోని ప్రతి అంశం, అమల్లో ఉన్న టారిఫ్ రేట్ల వివరాలను వివరించింది.
TGSPDCL Power Bill Charges Calculation : నెల తిరిగేసరికి చేతికి వచ్చే కరెంట్ బిల్లును చూసి చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. బిల్లులో ఉండే రకరకాల ఛార్జీలు, కోడ్‌లు సాధారణ వినియోగదారులకు అంత సులభంగా అర్థం కావు. ఈ నేపథ్యంలో…. కరెంట్ బిల్లుల జారీ ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు, వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు రసీదులో ముద్రించే ప్రతి సాంకేతిక పదం యొక్క పూర్తి వివరాలను, అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్టీ (LT) టారిఫ్ కేటగిరీల రేట్లను అధికారికంగా విడుదల చేసింది.

మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థలో వినియోగించే విద్యుత్ యూనిట్లను ఎలా లెక్కిస్తారు…? ఏ కేటగిరీ కింద ఎంత టారిఫ్ వసూలు చేస్తారు..? మీ బిల్లును మీరే స్వయంగా ఎలా సరిచూసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….
- ప్రాథమిక వివరాలు : బిల్లుపై ఉండే ERO (విద్యుత్ ఆదాయ కార్యాలయం కోడ్), AREACODE (సెక్షన్ విభాగం కోడ్), APP.VER (బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ వర్షన్), MacId (బిల్లింగ్ యంత్రం గుర్తింపు సంఖ్య) వంటివి అంతర్గత లెక్కింపునకు ఉపయోగిస్తారు.
- కనెక్షన్ సమాచారం : ఇందులో మీ సర్వీస్ కనెక్షన్ సంఖ్య (SC No), ప్రత్యేక వినియోగదారు సంఖ్య (USC No), పేరు, చిరునామా, మొబైల్ సంఖ్య మరియు ఈమెయిల్ ఐడీ ఉంటాయి.
- సాంకేతిక వివరాలు : Cat అంటే మీ కనెక్షన్ వర్గం (గృహ అవసరాలు లేదా వాణిజ్య అవసరాలు). Contracted Load అంటే ప్రభుత్వంతో మీరు ఒప్పందం చేసుకున్న విద్యుత్ లోడ్ (కిలోవాట్లలో ఉంటుంది). MF అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ (యూనిట్ల గణన కోసం వాడేది). PF అంటే పవర్ ఫ్యాక్టర్ (పారిశ్రామిక, వాణిజ్య వినియోగం కోసం చూసేది).
- రీడింగ్ వివరాలు : Present Reading (ప్రస్తుత రీడింగ్), Previous Reading (గత నెల రీడింగ్) ల మధ్య వ్యత్యాసాన్ని బట్టి Units (వినియోగించిన మొత్తం యూనిట్లు) లెక్కిస్తారు. Days అంటే బిల్లింగ్ చేసిన రోజుల సంఖ్య. Recorded MD అంటే నమోదైన గరిష్ట డిమాండ్.
- ఎనర్జీ ఛార్జీ : మీరు వాడిన కరెంట్ యూనిట్ల ఆధారంగా పడే అసలు ఛార్జీలు.
- ఫిక్స్ డ్ ఛార్జెస్ : మీ కనెక్షన్ లోడ్ ఆధారంగా విధించే స్థిర ఛార్జీలు.
- Customer Charges: వినియోగదారు సేవలకు గానూ వసూలు చేసే కస్టమర్ రుసుము.
- Electricity Duty - Interest on ED: విద్యుత్ సుంకం (పన్ను) మరియు ఆ పన్నుపై పడే వడ్డీ.
- Surcharge - FSA/FCA Charges: ఆలస్యంగా బిల్లులు చెల్లిస్తే పడే పెనాల్టీ (సర్‌ఛార్జ్) మరియు ఫ్యూయల్ ప్రైస్ సర్దుబాటు ఛార్జీలు.
- సబ్సిడీ - Adjustment: ప్రభుత్వం ఇచ్చే రాయితీ తగ్గింపులు మరియు సర్దుబాటు చేసిన మొత్తం.
- ఇంట్రెస్ట్ ఆన్ సీడీ : వినియోగదారుడి సెక్యూరిటీ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ (ఇది వినియోగదారుడి ఖాతాకే జమవుతుంది).
- Total Due - బిల్ అమౌంట్ : అన్ని రకాల ఛార్జీలు, పాత బకాయిలు (Arrears) కలిపి మొత్తం చెల్లించాల్సిన బకాయి. ఇందులో మీ బిల్లు కట్టడానికి ఆఖరి తేదీ (Due Date) మరియు కనెక్షన్ కట్ చేసే తేదీ (Disc Date) కూడా స్పష్టంగా ముద్రిస్తారు.
కేటగిరీ-2 లో చూస్తే దుకాణాలు, కార్యాలయాలు, ప్రకటనల బోర్డులు, హేర్ కటింగ్ సెలూన్లకు వర్తించే రేట్ల వివరాలుంటాయి. ఈ వివరాలను కూడా టీజీఎస్పీడీసీఎల్… ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
సరైన అవగాహనతో విద్యుత్ వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం వినియోగదారులు 24x7 అందుబాటులో ఉండేలా 1912 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

