చెన్నై పోర్టు ద్వారా చైనా బాణసంచా స్మగ్లింగ్ - రూ.12 కోట్ల సరుకు సీజ్

చెన్నై పోర్టు ద్వారా విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న  చైనా బాణాసంచాను హైదరాబాద్ డీఆర్‌ఐ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.ఈ అక్రమ బాణాసంచా మొత్తం విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అంచనా.

Published on: Oct 6, 2026, 13:22:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ అక్రమ మార్గంలో దేశంలోకి చైనా బాణాసంచాను తరలించేందుకు యత్నించిన స్మగ్లర్ల కుట్రను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), హైదరాబాద్ అధికారులు భగ్నం చేశారు. చైనా నుంచి అక్రమంగా భారీ ఎత్తున విదేశీ బాణాసంచాను దిగుమతి చేసుకుంటున్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో…ఈ తతంగంపై నిఘా పెట్టింది.

చెన్నై పోర్టు ద్వారా చైనా బాణసంచా స్మగ్లింగ్
చెన్నై పోర్టు ద్వారా చైనా బాణసంచా స్మగ్లింగ్

కాగితాలు, స్టేషనరీ వస్తువులు, మెడికల్ గ్లోవ్స్, ప్లాస్టిక్ క్లిప్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, స్టోరేజ్ వార్డ్‌‌రోబ్‌లు, షూ ర్యాక్‌లు తదితర గృహోపకరణాల పేరిట చైనా నుంచి షిప్పింగ్ కంటెయినర్లలో విదేశీ బాణాసంచాను నింపి రవాణా చేస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులు పసిగట్టారు. ఈ సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారం సమన్వయంతో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పద కంటెయినర్లను క్షుణ్ణంగా సోదాలు చేశారు.

రూ. 12 కోట్ల విలువ…

కంటెయినర్లలో పైన ప్రకటించిన సామాన్య వస్తువుల కార్టన్ల వెనుక అత్యంత తెలివిగా దాచి ఉంచిన భారీ పరిమాణంలోని చైనా పైరోటెక్నిక్ బాణాసంచాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ అక్రమ బాణాసంచా మొత్తం విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

భారతదేశ విదేశీ వాణిజ్య విధానం ప్రకారం…. విదేశాల నుంచి బాణాసంచా మరియు క్రాకర్స్ దిగుమతి చేసుకోవడంపై కఠినమైన నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వీటి దిగుమతికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అనుమతితో పాటు, ఎక్స్‌ప్లోజివ్స్ రూల్స్-2008 కింద పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) నుంచి కచ్చితమైన లైసెన్సులు పొందడం అనివార్యం. ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకుండా, తప్పుదారి పట్టించే నివేదికలు ఇస్తూ, అక్రమ మార్గంలో రహస్యంగా దిగుమతి చేసుకున్నందున కస్టమ్స్ చట్టం-1962లోని నిబంధనల ప్రకారం ఈ బాణాసంచాను డిఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారులపై అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More