హైదరాబాద్ వాసులకు అలర్ట్ - 36 గంటలపాటు నీటి సరఫరాకు బ్రేక్, ఏరియాల వారీగా వివరాలు

హైదరాబాద్ నగరవాసులకు మరోసారి జలమండలి అలర్ట్ ఇచ్చింది. సిటీకి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో మరమ్మత్తు పనులు చేయనున్నారు. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 

Published on: Jan 8, 2026, 20:47:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 లో మరమ్మత్తు పనులు చేయనున్నట్లు తెలిపింది. కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్ పై ఏర్పడిన లీకేజీని సరిచేయనున్నారు.

తాగునీటి సరఫరాలో అంతరాయం
తాగునీటి సరఫరాలో అంతరాయం

అంతేకాకుండా 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లను మార్పిడి చేస్తారు. నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు చేపట్టడం… వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీ (NRV)లను మార్పిడి చేయడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని జలమండలి ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ఈ పనుల కారణంగా… జనవరి 10వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే జనవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు (36 గంటలు) నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

  • ఓ&ఎం డివిజన్–XI: వనస్థలిపురం, ఆటోనగర్
  • ఓ & ఎం డివిజన్–XIX: ఆటోనగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
  • ఓ & ఎం డివిజన్–X: వైశాలీనగర్, నాగోల్
  • ఓ & ఎం డివిజన్–XX: బడంగ్‌పేట్, లెనిన్ నగర్, ఆదిభట్ల, కమ్మగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
  • ఓ & ఎం డివిజన్–VIII: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్ మరియు మైసారం పరిధిలోని ప్రాంతాలు
  • ఓ & ఎం డివిజన్–XIV: యెల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం
  • ఓ & ఎం డివిజన్–VII: తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి మరియు మహేంద్ర హిల్స్ రిజర్వాయర్
  • ఓ & ఎం డివిజన్–V: మేకలమండి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
  • టి.డి–III: ఎంఈఎస్, రైల్వేలు మరియు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు
  • ఓ & ఎం డివిజన్–IX: హష్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ
  • ఓ & ఎం డివిజన్–XVI: మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం మరియు ప్రశాసన్‌నగర్ – పాక్షికంగా..
  • ఓ & ఎం డివిజన్–I: నేషనల్ పోలీస్ అకాడమీ.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More