హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఇవాళ నీటి సరఫరాకు అంతరాయం, ఏరియాల వారీగా వివరాలు
హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అలర్ట్ ఇచ్చారు. సింగూరు ప్రాజెక్టు ఫేజ్ - 3లో పలు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్ - 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది. దీన్ని అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా మరోవైపు తెలంగాణ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు.

ఈ పనులు ఇవాళ(శనివారం) రాత్రి 8 గంటల వరకు జరుగుతాయని హైదరాబాద్ జలమండలి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
- డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.
- డివిజన్–9: కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.
- డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.
- డివిజన్–17: గోపాల్ నగర్.
- డివిజన్–22: తెల్లాపూర్.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. పొదుపుగా నీటిని వాడుకోవాలని పేర్కొన్నారు.మరమ్మతు పనులు పూర్తి కాగానే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

