డాక్టర్ ఇంట్లో డ్రగ్స్.. మరోచోట డ్రగ్ పార్టీ భగ్నం, 12 మంది అరెస్ట్!
హైదరాబాద్‌లో ఓ వైద్యుడి ఇంట్లో అధికారులు డ్రగ్స్ గుర్తించారు. మరోచోట గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేశారు.
తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్ పార్టీ కలకలం రేపింది. ఇటీవల డ్రగ్ పార్టీలపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రెండు ప్రదేశాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. ఓ వైద్యుడు ఇంట్లో భారీగా డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. మరోవైపు గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని భగ్నం చేశారు.

ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్ అనే వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అతడి నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించి సీజ్ చేశారు. జాన్‌పాల్‌ను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మరో ముగ్గురి మీద కూడా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ ఢిల్లీ, బైంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నారు. వైద్యుడి ఇంట్లో పెట్టి అమ్ముతున్నారు. అయితే జాన్‌పాల్‌కు ఉచితంగా డ్రగ్స్ అందిస్తున్నట్టుగా తేలింది. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
మరోవైపు గచ్చిబౌలిలోని కో లివింగ్ గెస్ట్ రూములో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. మెుత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారు. కో లివింగ్ రూములో డ్రగ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడి చేశారు. అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో కర్ణాటక నుంచి డ్రగ్ర్ తీసుకువచ్చి.. హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న మెయిన్ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు గుత్తా తేజ కృష్ణతోపాటుగా నైజీరియన్ దేశస్తుడు కూడా ఉన్నాడు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి.. హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. 12 మందిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ కేసులో భాగంగా డ్రగ్ నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలినవారిని కూడా అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్న విధానంపై పోలీసులు ఫోకస్ చేయనున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో డ్రగ్ పార్టీలు ఎక్కువగా జరుగుతున్నందున వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


