హైదరాబాద్ : SOT పోలీసులమని ఇంట్లోకి ఎంట్రీ - రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు..!

SOT పోలీస్ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నావని ఓ వ్యక్తిని బెదిరిస్తూ…  రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఘటన కూకట్ పల్లిలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Published on: Dec 27, 2025, 15:30:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఫేక్ ఎస్ ఓటీ పోలీసుల పేరుతో డబ్బులను డిమాండ్ చేశారు. అపార్ట్ మెంట్ లోకి చొరబడి… రూ.3 కోట్లు ఇవ్వాలని ఓ వ్యక్తిని బెదిరించారు. బెట్టింగ్ యాప్ లను నడుపుతున్నావని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ : SOT పోలీసులమని ఇంట్లోకి ఎంట్రీ - రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు..!(REPRESENTATIVE PIC)
హైదరాబాద్ : SOT పోలీసులమని ఇంట్లోకి ఎంట్రీ - రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు..!(REPRESENTATIVE PIC)

ఫిర్యాదులోని వివరాల ప్రకారం…. నర్సింహరాజుతో సహా ఐదుగురు వ్యక్తులు అపార్ట్ మెంట్ వద్దకు వచ్చారు. మాదాపూర్ ఎస్ఓటి సిబ్బందిగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమంగా బెట్టింగ్ యాప్స్ ను ఆపరేట్ చేస్తున్నాడని బెదిరించి… రూ.3 కోట్లు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ధృవీకరించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ…. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గుర్తించామని చెప్పారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టామని వివరించారు.

అంతేకాకుండా ఫిర్యాదుదారుడు స్వయంగా బెట్టింగ్ యాప్స్ ఆపరేషన్లలో పాల్గొన్నట్లు కూడా గుర్తించామని చెప్పారు. అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కూకట్ పల్లి పోలీసులు పేర్కొన్నారు.

నిందితులు ఐదుగురు కాగా… వీరిలో నరసింహ రాజు, రవీంద్రబాబు అనే ఇద్దరు అరెస్ట్ అయినట్లు తెలిసింది. ఫ్లాట్ లోకి చొరబడ్డ మిగతా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More