నవంబర్ 21న హైవే దిగ్బంధనకు రైతులు భారీగా తరలిరావాలి : కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి కష్టంగా లేకుండా చూశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతీ ధాన్యం గింజ కొన్నామని చెప్పారు.
పత్తి, ధాన్యం సేకరణపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 21న హైవే దిగ్బంధనకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని స్థానిక మార్కెట్ యార్డ్‌లో పత్తి, సోయా రైతుల సమస్యలపై మాట్లాడేందుకు కేటీఆర్ వచ్చారు. పత్తి, ధాన్యం సేకరణ లోపాలు, వ్యాపారుల కుట్రపై ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ కుప్పకూలడం వల్ల పత్తి, సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన సంక్షోభం ఇదేనని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 21న రైతు సంఘాలు పిలుపునిచ్చిన రహదారి దిగ్బంధనకు బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో అర్థవంతమైన మద్దతు లభించలేదని, తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే అవకాశాన్ని కోల్పోయిందని కేటీఆర్‌కు రైతులు చెప్పారు. సంక్షోభం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలను కేటీఆర్ ప్రశ్నించారు. 'అంతా సాధారణంగా ఉంటే ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ఎందుకు మూసివేశారు? బీఆర్ఎస్ నాయకులు రైతులను కలవకుండా ఎందుకు ఆపారు?' అని కేటీఆర్ అడిగారు.
ప్రస్తుత సేకరణ విధానంలో పలు లోపాలను కేటీఆర్ ఎత్తి చూపారు. అకాల వర్షాలతో తేమ స్థాయి పెరిగినా.. కఠినమైన 12 శాతం తేమ పరిమితిని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుపటి బీఆర్ఎస్ పాలనలో, కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన తర్వాత 20–22 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
ఈ ప్రాంతంలో సగటు దిగుబడి 10–15 క్వింటాళ్లు ఉన్నప్పటికీ, ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే పరిమితి విధించారని కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల మిగులు దిగుబడి అమ్ముడుపోవడం లేదన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష క్వింటాళ్ల కంటే తక్కువ పత్తిని సేకరించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని కేటీఆర్ అన్నారు. ధరలను తగ్గించడానికి అధికారులు, ప్రైవేట్ వ్యాపారుల మధ్య కుట్ర జరుగుతోందని కూడా ఆరోపించారు. పంట నష్టాలు, అప్పుల కారణంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు దీపక్ కుటుంబానికి పార్టీ ఆర్థిక సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
కనీస మద్దతు ధర రూ.8100 రైతుకు దక్కాల్సింది కానీ ఐదారు వేలు కూడా దక్కడం లేదని కేటీఆర్ అన్నారు. సోయాబీన్ అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తల్లిదండ్రుల పేరు మీదట ఉన్న పంటలను బిడ్డలు అమ్మాలంటే కూడా కొనుగోలు చేయాడం లేదన్నారు.
అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలని కేటీఆర్ అన్నారు. నష్టపోయిన ప్రతీ రైతన్నకు ఎకరానికి రూ.20000 చొప్పున కనీస నష్టపరిహారం ఇవ్వాలన్నారు. స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇక్కడి కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ ప్రభుత్వాలను అడగాలన్నారు కేటీఆర్.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


