...
...
Next Story

Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - కారుని ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్, ఐదుగురు మృతి

Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగంగా వచ్చిన రేసింగ్ బైక్, కారు ఢీకొనడంతో… ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Published on: May 11, 2026, 08:06:37 IST
Advertisement

Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. పాలకొండ జంక్షన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు వ్యక్తుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. అతివేగం, అజాగ్రత్త వెరసి రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.

ఐదుగురు మృతి…!

పాలకొండ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
పాలకొండ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాలకొండ జంక్షన్ వద్ద ఒక కారు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో, అత్యంత వేగంగా వచ్చిన ఒక రేసింగ్ బైక్ దానిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పల్టీలు కొట్టగా, బైక్ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న వారు అలాగే బైక్ నడుపుతున్న యువకుడు ఉన్నట్లు తెలిసింది.

ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.

పాలకొండ జంక్షన్ వద్ద వాహనాలు రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచికలు ఉన్నప్పటికీ, రేసింగ్ బైక్ మితిమీరిన వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. జంక్షన్ వద్ద వేగాన్ని నియంత్రించకపోవడం, అవగాహన లోపం ప్రాణాపాయానికి దారితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe