...
...
Next Story

హైదరాబాద్ : టోలీచౌకీలో ఘోర ప్రమాదం - భవనం పైనుంచి పడి ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్ లోని టోలీచౌకిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published on: Mar 05, 2026 04:58 PM IST
Advertisement

హైదరాబాద్ సిటీలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనంపై నుంచి పడిపోయి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరందా కూలిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టింది.

నాలుగు అంతస్తుల భవనంపైనుంచి పడి నలుగురు మృతి
నాలుగు అంతస్తుల భవనంపైనుంచి పడి నలుగురు మృతి

ఈ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రక్షణ చర్యలు చేపట్టడం, గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించే విషయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe