హైదరాబాద్ : ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన - సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్
ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. కేబిన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం…. కేరళకు చెందిన ప్రయాణికుడు శుక్రవారం ప్రయాణిస్తున్నప్పుడు మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ మేరకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సదరు ప్రయాణికుడు(30) మద్యం / మత్తులో ఉన్నట్లు క్యాబిన్ సిబ్బంది గమనించింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత కెప్టెన్, గ్రౌండ్ స్టాఫ్ కు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాండింగ్ తర్వాత తన సీటులో పాస్ పోర్ట్ ను తప్పుగా ఉంచినట్లు ప్రయాణికుడు పేర్కొన్నాడు. సిబ్బంది దాని కోసం వెతకడానికి వెళ్ళినప్పుడు…. సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడాడు.
కేబిన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వ్యక్తి కేరళకు చెందినవాడుగా గుర్తించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

