...
...
Next Story

కవ్వాల్‌‌‌కు కొత్త టైగర్ కారిడార్ ప్లాన్ చేస్తున్న అటవీ శాఖ.. టైగర్ సెల్ కూడా

కవ్వాల్‌‌‌కు కొత్త టైగర్ కారిడార్‌ను అటవీ శాఖ ప్లాన్ చేస్తోంది. వలస వచ్చే పులులకు సురక్షితమైన మార్గాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published on: Dec 7, 2025, 14:28:06 IST
Advertisement

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుండి భీమ్‌పూర్, బోథ్, కడెం నది ప్రాంతాల అడవుల గుండా కవ్వాల్‌‌‌ టైగర్ రిజర్వ్ వరకు మరో టైగర్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ ప్లాన్ చేస్తోంది. నవంబర్ నుండి జనవరి వరకు పులుల సంభోగం సమయంలో ఆదిలాబాద్‌కు వలస వచ్చే పులులకు సురక్షితమైన మార్గాన్ని అందించడం, తద్వారా అవి కవ్వాల్‌‌‌ టైగర్ రిజర్వ్‌లోకి ప్రవేశించి చివరికి అక్కడ నివాసం ఉండేందుకు ఈ కారిడార్‌ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది అటవీశాఖ.

కొత్త టైగర్ కారిడార్
కొత్త టైగర్ కారిడార్

ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూర్ మండలం గొల్లఘాట్-తంసి ప్రాంతంలో ప్రస్తుతం సంచరిస్తున్న రెండు పులులకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి స్థానిక రైతులలో అవగాహన కల్పిస్తున్నారు అటవీశాఖ అధికారులు. రెండు అటవీ ప్రాంతాల మధ్య పలు ప్రాంతాలను కలపడం ద్వారా పులులు కవాల్‌లోకి ప్రవేశించడానికి అంతరాయం లేని మార్గాలను సృష్టిస్తున్నారు. మనుషుల అంతరాయం లేకుండా అటవీ ప్రాంతాన్ని తయారుచేసే ఆలోచనలో ఉంది అటవీశాఖ. ఇందులో భాగంగా మెుక్కలను కూడా పెంచుతున్నారు.

పులి కదలికలను 24 గంటలూ పర్యవేక్షించడానికి, భద్రతా చర్యలు తీసుకోవడానికి టైగర్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అటవీశాఖ అంటోంది. జిల్లా అధికారులు పులుల వీక్షణలపై రియల్ టైమ్ అప్డేట్స్ పంచుకుంటారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడం, రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించడం కోసం జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఆదిలాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో పర్యావరణ పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.

తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుండి పులులు గత నాలుగు సంవత్సరాలుగా పెన్‌గంగా నదిని దాటి ఆదిలాబాద్‌కు వలస వస్తున్నాయి. అందుకే రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పులులకు హాని కలిగించకుండా చూసుకోవడానికి, మనుషులపై దాడి చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe