...
...
Next Story

త్వరలో BRS గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ - బీజేపీకి రాజీనామా

బీజేపీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.

Published on: Jan 26, 2026, 21:47:00 IST
Advertisement

బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆరూరి రమేశ్
ఆరూరి రమేశ్

గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరూరి రమేశ్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడారు.

పార్లమెంట్ ఎన్నికల ముందుకు బీజేపీ గూటికి చేరారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలం పాటు పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. అయితే చాలా రోజులుగా ఆయన పార్టీ మారుతారనే చర్చ జోరుగా వినిపించాయి.ఈ వార్తలను ఆయన కొట్టిపారిస్తూ వచ్చినప్పటికీ…. తాజాగా మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks