యాదాద్రి జిల్లాలో రూ. 54 కోట్ల డ్రగ్స్ కలకలం - నలుగురు అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీక్రెట్ ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు దాడి చేశారు.

Published on: Aug 9, 2026, 20:26:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా నిషేధిత మత్తు పదార్థాలు వెలుగుచూశాయి. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును బీబినగర్ పోలీసులు, ఎస్‌ఓటీ వర్గాలు రట్టు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ. 54 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 27 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

యాదాద్రి జిల్లాలో రూ. 54 కోట్ల డ్రగ్స్ కలకలం - నలుగురు అరెస్ట్
యాదాద్రి జిల్లాలో రూ. 54 కోట్ల డ్రగ్స్ కలకలం - నలుగురు అరెస్ట్

పక్కా సమాచారంతో మెరుపు దాడి

ఆగస్టు 8వ తేదీన కొండమడుగు గ్రామం శివారు ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరుగుతోందని బీబినగర్ పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందంతో కాపుకాసి, అనుమానాస్పదంగా వస్తున్న ఒక కార్‌ను అడ్డుకున్నారు.

వాహనంలో తనిఖీలు చేయగా 27 కిలోల వైట్ పౌడర్ రూపంలో ఉన్న మెఫెడ్రోన్‌తో పాటు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 40 కిలోల అసిటోన్ రసాయనం కలిగిన రెండు ప్లాస్టిక్ క్యాన్లు లభ్యమయ్యాయి. రహస్య ల్యాబ్‌లోనే డ్రగ్స్ తయారీఅరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, అస్సాం, హైదరాబాద్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే విషయాలు బయటపెట్టారు.

"ఆగస్టు 5 నుంచి 7 తేదీల మధ్య కొండమడుగులోని ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీలో ఈ మత్తు పదార్థాన్ని అక్రమంగా తయారు చేశాం. ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించి, అక్కడ పంపిణీ చేయడమే మా ప్లాన్," అని నిందితులు విచారణలో అంగీకరించారు.

నిందితుల సమాచారంతో పోలీసులు వెంటనే సదరు ల్యాబ్‌పై దాడి చేసి…. డ్రగ్స్ తయారీకి ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ వంటి అత్యాధునిక యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా నిర్మాణం, పోలీసుల తదుపరి చర్యలుఈ అక్రమ డ్రగ్స్ దందాలో ఫైనాన్సియర్‌గా వ్యవహరించిన వ్యక్తి, తయారీకి సహకరించిన నిపుణుడు, ల్యాబ్ ఇన్‌ఛార్జ్, రవాణా బాధ్యతలు చూసే వ్యక్తులు చిక్కినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

నిందితులకు రిమాండ్….

నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా… కోర్టు వారికి రిమాండ్ విధించింది.ఈ కేసులో ప్రధాన సూత్రధారులతో పాటు ల్యాబ్ యజమాని పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ల్యాబ్ ప్రాంగణాన్ని, యంత్రాలను చట్టపరమైన నిబంధనల ప్రకారం సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More