వరంగల్ నిట్‌లో ఫ్రీగా గేట్ కోచింగ్.. అప్లై చేయండి, మరికొన్ని రోజుల్లో స్టార్ట్!

గేట్‌కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీ కోసం గుడ్‌న్యూస్. వరంగల్ నిట్‌లో ఉచితంగా గేట్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Published on: Nov 5, 2025, 18:18:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరంగల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో గేట్ కోచింగ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఈ ఉచిత గేట్ కోచింగ్ తరగతులు ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ వెల్లడించారు. ఈ కోచింగ్ అనేది వరంగల్ నిట్ విద్యార్థులతోపాటుగా వరంగల్ పరిసర ప్రాంతాల్లోని ఇతర ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చు.

వరంగల్ నిట్
వరంగల్ నిట్

త్వరలో విద్యార్థులకు క్లాసులు అందుబాటులో ఉంటాయని, తరగతులు ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించినట్టుగా నిట్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ కోర్సును ఎనిమిది వారాలపాటు చెప్పనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 9 వరకు తరగతులు జరుగుతాయి.

ఎవరైతే ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో.. వారికి ఇది చాలా ఉపయోగపడనుందని నిట్ డైరెక్టర్ అన్నారు. పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం అయ్యేందుకు సాయపడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు అప్లికేషన్ ఫారం నింపి తరగతులకు హాజరుకావాలి. ఈ కోచింగ్‌కు సంబంధించి దరఖాస్తు ఫారం, నియమాలు, నిబంధనలు.. మరిన్ని వివరాల కోసం వరంగల్ నిట్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విభాగాన్ని సందర్శించాలి. ఇతర వివరాలకు వరంగల్ నిట్ ఎస్సీ, ఎస్టీ సెల్‌ను సంప్రదించవచ్చు.

డైట్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

హనుమకొండలోని ప్రభుత్వ విద్యాశిక్షణా సంస్థ(డైట్‌)లో ఖాళీగా ఉన్నా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. కళలు-కళా విద్య-1, ఫిలాసఫీ/సోషియాలజీ/సైకాలజీ-1, పెడగోజి ఆఫ్‌ మ్యాథమెటిక్స్​​-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా ప్రిన్సిపల్ ఎండీ అబ్దుల్‌ తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు కాలేజీలో ఇచ్చే అప్లికేషన్ ఫారం పూర్తి చేసి.. ఫొటో, విద్యార్హత పత్రాలను జతచేసి నవంబర్ 7 నుంచి 13 వరకు సమర్పించాలి. 65 ఏళ్లలోపు ఉన్న రిటైర్డ్, నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు. మెరిట్ ప్రాతిపదికన నవంబర్ 14న ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. 1:5 నిష్పత్తిలో 15న డెమో/ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఎంపికైన వారిని ప్రకటిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More