Hyderabad Smart Multilevel Rotary Parking : ఇక 'స్మార్ట్'గా కార్ పార్కింగ్ - ప్రత్యేకతలు తెలుసా..?

హైదరాబాద్ సిటీలోని కేబీఆర్‌ పార్క్ వద్ద నిర్మించ తలపెట్టిన మల్టీలెవల్‌ స్మార్ట్‌ కారు పార్కింగ్‌ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ్‌ అసోసియేట్‌ సంస్థ మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను నిర్మించింది. ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి…

Published on: Nov 29, 2025, 12:34:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ లోని కేబీఆర్‌ పార్క్ వద్ద పార్కింగ్ సమస్యలకు చెక్ పడనుంది.జీహెచ్ఎంసీ తలపెట్టిన మల్టీలెవల్‌ స్మార్ట్‌ కారు పార్కింగ్‌ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది.405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మల్టీలెవల్‌ స్మార్ట్‌ కార్‌ పార్కింగ్‌ ను సిద్ధం చేశారు. 72 ఈక్వివలెంట్‌ కారు స్పేసెస్‌తో పాటు పార్కింగ్‌ విస్తీర్ణంలో 20 శాతాన్ని ద్విచక్ర వాహనాల కోసం కేటాయించారు.

కేబీఆర్ పార్ట్ వద్ద మల్టీలెవల్‌ స్మార్ట్‌ కారు పార్కింగ్‌
కేబీఆర్ పార్ట్ వద్ద మల్టీలెవల్‌ స్మార్ట్‌ కారు పార్కింగ్‌

ముఖ్యమైన వివరాలు - ప్రత్యేకతలు :

  • హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్​ పార్క్​లో మొట్టమొదటి స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్‌ నవంబర్ 29, 2025 నుంచి అందుబాటులోకి వస్తుంది.
  • ఇందులో 72 కార్లను పార్క్​ చేయవచ్చు. అలాగే బైక్​లను నిలపడానికి ప్రత్యేక స్థలం ఉటుంది.
  • హైదరాబాద్ నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్‌ స్మార్ట్‌ రోటరీ పార్కింగ్‌.
  • ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చేవారితో పాటు చుట్టుపక్కల వారికి పార్కింగ్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.
  • 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ్‌ అసోసియేట్‌ సంస్థ మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను నిర్మించింది.
  • ఈ ప్రాజెక్టును నవ నిర్మాణ్‌ అసోసియేట్స్‌ డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) పీపీపీ మోడల్‌లో నిర్మించి అమలు చేస్తున్నారు.
  • ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్కు చేసుకునే వీలు ఉంటుంది.
  • RFID-ప్రారంభించబడిన స్మార్ట్ ఎంట్రీ ఎగ్జిట్ సౌకర్యం ఉంటుంది.
  • ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అందుబాటులో ఉంటాయి.
  • సీసీటీవీ, లోడ్ సెన్సార్స్, ఎమర్జెన్సీ సెఫ్టీ సిస్టమ్స్
  • సిటీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన KBR పార్క్ చుట్టూ పెరుగుతున్న రోడ్డు పక్కన రద్దీని పరిష్కరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను పార్క్​ చేయడానికి ఈ విధానం సహకరిస్తుంది.

"నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరణ దిశగా తీసుకెళ్తూ, ఈరోజు కేబీఆర్ పార్క్ వద్ద ఆటోమేటెడ్ స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పార్కింగ్ సౌకర్యాల మెరుగుదల, ప్రజలకు ప్రపంచ స్థాయి సేవలు అందించడంలో ఇది కీలక అడుగు. హైదరాబాద్ అభివృద్ధి – ప్రజల సౌకర్యం మా ప్రభుత్వ ప్రాధాన్యత" అని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More