డెలివరీ బాయ్స్‌కి గుడ్‌న్యూస్.. గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం!
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణలో ఉన్న మూడు లక్షలకుపైగా గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన గుర్తింపు, సంక్షేమం కల్పించే దిశగా తెలంగాణ కేబినెట్ “తెలంగాణ ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం)చట్టం, 2025” ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం బిల్లును ఆమోదించింది. కేబినెట్ సమావేశం తర్వాత కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని అన్నారు.

గిగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, అగ్రిగేటర్లు, ప్రభుత్వంతో ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లను అగ్రిగేటర్లు తప్పనిసరి నమోదు చేయడం, గిగ్ వర్కర్ సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి కార్మికులు, అగ్రిగేటర్లు, ప్రభుత్వంతో కూడిన త్రిసభ్య బోర్డు, త్రైపాక్షిక బోర్డు నిర్వహించే గిగ్ వర్కర్ల సంక్షేమ నిధి వంటివి ప్రతిపాదిత చట్టంలోని కీలకమైన నిబంధనలలో ఉన్నాయి.
గిగ్ కార్మికులకు న్యాయం చేయడమే ఈ బిల్లు లక్ష్యం అని మంత్రి వెంకటస్వామి అన్నారు. గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. ఈ బిల్లు రాష్ట్రంలోని 4.2 లక్షల మంది గిగ్ కార్మికులను రక్షించి, వారికి మద్దతు ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్‌లో ప్రకటించారు. ఈ చట్టం మొత్తం దేశానికే ఒక నమూనాగా ఉండాలని కూడా ఆయన పేర్కొన్నారు. గిగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులను కల్పించే లక్ష్యంతో కార్మిక శాఖ ఈ ముసాయిదాను రూపొందించింది.
ఏప్రిల్ 14న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ముసాయిదాలో అనేక మార్పులు, చేర్పులను సూచించారు. కొత్త చట్టం కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్ల మధ్య సామరస్యం, సమన్వయాన్ని పెంపొందించాలని సీఎం అప్పుడు నొక్కి చెప్పారు. ముసాయిదా బిల్లును వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, ప్రజల నుండి అభిప్రాయాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయిన మే 1న బిల్లును ఆమోదించి అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కానీ దానిని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆహార పంపిణీ, రవాణా, ప్యాకేజీ డెలివరీ వంటి రంగాలలో దాదాపు 4 లక్షల మంది గిగ్ కార్మికులు పనిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దేశంలో గిగ్ కార్మికులకు ప్రమాద బీమాను అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ ఉంది. డిసెంబర్ 30, 2023న గిగ్ లేదా ప్లాట్‌ఫారమ్ కార్మికుడు మరణించిన సందర్భంలో రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బిల్లులో పలు కీలక అంశాలు ఉన్నాయి. గిగ్ కార్మికులకు చట్టపరమైన గుర్తింపు, ప్రత్యేక ఐడీ లభిస్తుంది. కార్మిక శాఖ మంత్రి ఛైర్మన్‌గా 20 మంది సభ్యులతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు, కార్మికులు, పౌర సమాజం, సాంకేతిక నిపుణులు కూడా ఉంటారు. ఈ బోర్డు పదవీకాలం 3 ఏళ్లుగా ఉంటుంది. గిగ్ వర్కర్లకు చట్టపరంగా హక్కులు లభిస్తాయి. వేతనం లేదా కమిషన్ చెల్లింపులు, రేటింగ్స్, అల్లోరిథంలో పారదర్శకత హక్కు లభిస్తుంది.
గిగ్ వర్కర్ల పేరు నమోదు తప్పనిసరిగా ఉంటుంది. కంపెనీలు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను షేర్ చేయాలి. అగ్రిగేటర్లు 45 రోజుల్లో సంక్షేమ బోర్డు వద్ద తమ కంపెనీ పేరు నమోదు చేయాలి. దీంతో ఎన్ని కంపెనీలు, ఎంతమంది పని చేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. రేటింగ్స్ విషయంలోనూ అగ్రిగేటర్లు ఇష్టం వచ్చినట్టుగా చేయడం కుదరదు. యాప్ కంపెనీలు తప్పనిసరిగా తమ అల్గోరిథమ్స్, అసైన్‌మెంట్స్, గిగ్ వర్కర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు, వారి ఆదాయాన్ని ప్రభావితం చేసే వివరాలను తెలిసిన భాషలో బహిర్గతం చేయాలి.
గిగ్ వర్కర్లను తొలగించాలంటే 7 రోజుల నోటీసు తప్పనిసరి. అయితే దుష్ప్రవర్తన కారణంగా అయితే వెంటనే తొలగిస్తారు. గిగ్ వర్కర్లతో అగ్రిగేటర్ల ఒప్పంద మార్పులకు 14 రోజుల నోటీసు ఇవ్వాలి. ఇలా గిగ్ వర్కర్లకు అనేక హక్కుల లభిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


