TG Govt Medical Jobs 2025 : జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 52 ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే
జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 52 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలున్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబరు 6వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని కలిపి 52 ఉద్యోగాలున్నాయి. https://gmcjangaon.org/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి. కేవలం ఇంటర్వ్యూల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 23 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వీటిలో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, రేడియో-డయాగ్నోసిస్, ఆర్థోపెడిక్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్,రెస్పిరేటరీ మెడిసిన్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఎపిడెమియాలజిస్ట్ విభాగాలున్నాయి. దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు.…. 31-03-2025 నాటికి 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనగాం
- ఉద్యోగ ఖాళీలు - 52
- ఖాళీల వివరాలు - ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ - 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 13, సీనియర్ రెసిడెంట్ - 23
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రర్ చేసుకొని ఉండాలి.
- ఇంటర్వ్యూ తేదీ: 6-11-2025.
- ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం : ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, 2వ అంతస్తు, ఎంసీహెచ్ సెంటర్, చంపక్ హిల్స్, జనగామ.
ఇంటర్వ్యూకి తీసుకురావాల్సి పత్రాలు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- పుట్టిన తేదీ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి వరకు)
- ఎంబీబీఎస్/ MD/MS/DNB డిగ్రీ సర్టిఫికెట్లు
- మార్కుల మెమోలు
- ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం
- ఉద్యోగానుభవానికి సంబంధించిన పత్రాలు
- నోటిఫికేషన్ లో పేర్కొన్న ఇతర పత్రాలు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

