Konda Surekha Dismissal : కేబినెట్ నుంచి కొండా సురేఖ ఔట్ - బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు జారీ

తెలంగాణ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి పంపిన సిఫార్సుకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Published on: Sep 3, 2026, 21:16:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తె

కొండా సురేఖ
కొండా సురేఖ

తెలంగాణ రాజకీయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ (బర్తరఫ్) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ బర్తరఫ్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

అనేక పరిణామాల మధ్య కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన గవర్నర్…. వెంటనే ఆమోదం తెలుపుతూ రాజ్‌భవన్ ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు.

గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, తదితర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఒక మంత్రిని బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నుంచి అధికారికంగా జీవో రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ పరిణామంతో ఆమె తక్షణమే తన మంత్రి పదవిని కోల్పోనున్నారు.

ఈ నిర్ణయానికి సంబంధించిన తదుపరి పరిణామాలు, ప్రభుత్వంలో జరగబోయే మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ శాఖలను మరొకరికి కేటాయించడం లేదా ముఖ్యమంత్రి వద్దే ఉంచుకోవడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More