...
...
Next Story

ఉత్తర తెలంగాణలో టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్.. యాత్రికులను పెంచేలా ప్లాన్!

ఉత్తర తెలంగాణలో ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా యాత్రికులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Published on: Nov 17, 2025, 09:35:41 IST
Advertisement

ఉత్తర తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసరలను కలుపుతూ టెంపుల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని సామాజిక-ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించే వ్యూహంలో ఒక భాగం. ఈ ఆలయాలు నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఈ ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే యాత్రికులకు రోడ్డు కనెక్టివిటీని గణనీయంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రాజెక్ట్.

వేములవాడ రాజన్న ఆలయం
వేములవాడ రాజన్న ఆలయం

ఆలయ కారిడార్ అభివృద్ధి మొదటి దశలో రెండు ప్రధాన సర్కిల్‌లలో రోడ్లను అప్‌గ్రేడ్ చేయడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం నిధులను ఆమోదించింది. నిజామాబాద్-1 సర్కిల్‌లోని 15 రోడ్లను అభివృద్ధి చేయడానికి దాదాపు 412.33 కోట్లు కేటాయించారు. నిజామాబాద్-2 సర్కిల్‌లోని 15 రోడ్లకు అదనంగా 243.69 కోట్లు మంజూరు చేశారు. ఈ సమగ్ర రహదారి అభివృద్ధి ప్రాజెక్ట్ అధునాతన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది మన్నికైన, అధిక-నాణ్యత గల రోడ్ల నిర్మాణాన్ని హామీ ఇస్తుంది.

నిజామాబాద్ జిల్లాలోని ముప్పై రోడ్లను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కారిడార్‌లో చేర్చిన ప్రధాన యాత్రా స్థలాలకు మరింత కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక సర్క్యూట్‌లోని మల్కాపూర్, కొల్లూరు, హున్సా, సాలూరు, మరొక సర్క్యూట్‌లోని నందిపేట, యాంచ, బాసర వంటి రోడ్లు పునరద్ధరిస్తారు. భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తారు.

ఈ కారిడార్ యాత్రికులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా.. ఎక్కువ మంది యాత్రికులను ఆకర్షించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కనెక్టివిటీతో కొండగట్టులోని హనుమాన్ ఆలయం, లింబాద్రి గుట్టలోని నరసింహ స్వామి ఆలయం, బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు ఎక్కువ మంది భక్తులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe