...
...
Next Story

కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకే అక్రమ కేసులు - హరీశ్ రావ్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్‌ అనుమతించడంపై స్పందిస్తూ… కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

Published on: Nov 20, 2025, 19:04:32 IST
Advertisement

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై స్పందిస్తూ…. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ అనుమతించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావ్
మాజీ మంత్రి హరీశ్ రావ్

"మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్‌ సర్కార్‌" అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

“హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం” అని హరీశ్ రావు దుయ్యబట్టారు.

“స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

అప్రజాస్వామికం - మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయకక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యనికి తూట్లు పొడవటమేనని చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks