BRS MLAs Defection Case : స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తాం - సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. మరో మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోపు స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో BRS ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై మరోసారి విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం… … స్పీకర్ కు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఇప్పటికే స్పీకర్ 3 సార్లు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. జనవరి 16 తర్వాత… జనవరి 30న తదుపరి విచారణ చేపట్టారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు న్యాయస్థానం స్పందిస్తూ…. “మార్చి నాటికి పూర్తవుతాయని వారు చెబుతున్నారు. 3 వారాల తర్వాత జాబితా చూస్తాం. స్పీకర్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము, లేకుంటే మేము కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటాం” అని బదులిచ్చింది.
స్పీకర్ తరపు న్యాయవాదిగా ఉన్న అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ… ఇప్పటికే 8 పిటిషన్లపై విచారణ పూర్తి అయిందని… మరో 2 రెండింటిని కూడా పూర్తి చేస్తారని కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… 3 వారాల గడువు ఇస్తూ విచారణన వాయిదా వేసింది.
ఈ కేసుపై జనవరి 16వ తేదీన విచారణ జరిగింది. స్పీకర్ విజ్ఞప్తి మేరకు… 4 వారాల గడువు ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి విచారణ జరపగా… స్పీకర్ మరోసారి గడువు కోరారు. ఈ నేపథ్యంలో 3 వారాల గడువు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

