ముంచెత్తిన మెుంథా తుపాను.. వరద నీటితో ఓరుగల్లు ఆగమాగం!
ఉమ్మడి వరంగల్ జిల్లాను మెుంథా తుపాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇక వరంగల్, హన్మకొండ నగరాలను వరద నీరు ముంచెత్తింది. కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. మెుంథా తుపాను ప్రభావంతో భారీగా వర్షం పడి వరంగల్, హన్మకొండ నగరాలను జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇంకా వరద నీరు బయటకు వెళ్లలేదు. పలు ప్రాంతాల్లో అయితే అడుగు తీసి బయటపెట్టే పరిస్థితి లేదు.

మోంథా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరంగల్, హన్మకొండలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి, ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద నీరు పెద్ద ఎత్తున రోడ్లపై ప్రవహించింది.
వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 45 ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయని, దీనితో పరిపాలన పెద్ద ఎత్తున తరలింపు, పునరావాస చర్యలను ప్రారంభించామని చెప్పారు. విపత్తు ప్రతిస్పందన దళం, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను సహాయక చర్యలు చేపట్టడానికి నియమించినట్లు వెల్లడించారు.
లోతట్టు ప్రాంతాల నుండి సుమారు 1,200 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మేయర్ తెలిపారు. వరదల వల్ల నిరాశ్రయులైన వారికి వసతి కల్పించడానికి నగరం అంతటా 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీటితో నిండిన కాలనీల్లోని వారి సేఫ్టీని నిర్ధారించడానికి బృందాలను పంపించారు.
వరంగల్‌లోని సుమారు 30 కాలనీలు, హన్మకొండలోని 15 కాలనీలు నీట మునిగాయి. సంతోషి మాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలలో తీవ్రంగా నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హంటర్ రోడ్డులోని బొంధి వాగు పొంగిపొర్లడంతో వరంగల్, హన్మకొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డులో నీటి మట్టం పెరగడంతో వాహనాలు వెళ్లడానికి వీలు కాలేదు. రామకృష్ణ, రెవెన్యూ కాలనీలలో చిక్కుకున్న నివాసితులను రక్షించడానికి పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది తాళ్లను ఉపయోగించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ వైపున కూడా భారీ వరద నీరు రోడ్లపై పారింది. వడ్డేపల్లి కూడా తీవ్రంగా ప్రభావితమైంది.
భద్రకాళి చెరువు పొంగిపొర్లడంతో ఆలయ ప్రాంతం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు వరద నీరు వచ్చింది. చిన్న చెరువులు కూడా పొంగిపొర్లడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇంకా వరంగల్, హన్మకొండ నగరాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


