ఈశాన్య బంగాళాఖాతంలోని ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎల్లోహెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(జూలై 19) వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు (గంటకు 30 -40 కిమీ) వీచే ఛాన్స్ ఉంది.
ఎల్లుండి (జూలై 20) మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఉపరితలగాలులు (గంటకు 30 -40 కిమీ) వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలుకురిశాయి. అయితే హైదరాబాద్ లోని పలుచోట్ల మాత్రం భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, బస్తీల్లో వరద పోటెత్తింది. రాష్ట్రంలో అత్యధికంగా ఉప్పల్‌లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీకి భారీ వర్ష సూచన:
మరోవైపు ఏపీలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడవద్దని హెచ్చరించింది.
{{/usCountry}}మరోవైపు ఏపీలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడవద్దని హెచ్చరించింది.
{{/usCountry}}శుక్రవారం(జూలై 18) ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుకురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.