ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో 3 రోజులు భారీ వర్షాలు..! ఈ ప్రాంతాలకు హెచ్చరికలు
ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈశాన్య బంగాళాఖాతంలోని ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎల్లోహెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(జూలై 19) వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు (గంటకు 30 -40 కిమీ) వీచే ఛాన్స్ ఉంది.
ఎల్లుండి (జూలై 20) మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఉపరితలగాలులు (గంటకు 30 -40 కిమీ) వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలుకురిశాయి. అయితే హైదరాబాద్ లోని పలుచోట్ల మాత్రం భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, బస్తీల్లో వరద పోటెత్తింది. రాష్ట్రంలో అత్యధికంగా ఉప్పల్‌లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీకి భారీ వర్ష సూచన:
మరోవైపు ఏపీలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడవద్దని హెచ్చరించింది.
శుక్రవారం(జూలై 18) ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుకురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


