జీహెచ్ఎంసీ టు ORR...! ఇక మీ ఇంట్లో అవి ఏర్పాటు చేసుకోవాల్సిందే - 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఇంటింటా ఇంకుడుగుంత దిశగా హైదరాబాద్ జలమండలి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.వచ్చే వారం నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. జీహెచ్ఎంసీ నుంచి ORR వరకు భూగర్భ జలాలను పెంచమే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకు భూగర్భ జలాలను పెంచమే లక్ష్యంగా జలమండలి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.ఇంటింటా ఇంకుడుగుంతలను ఏర్పాటే చేసే దిశగా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. 200 గజాలు, 300 గజాలపైన ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మాణం చేసుకునేలా ఏర్పాట్లు చేయనుంది.ఇదే అంశంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

జీహెచ్ఎంసీ నుండి ఓఆర్ ఆర్ వరకు భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా.. ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అశోక్ రెడ్డి కోరారు. జలమండలి భూగర్భజలాల పెంపు కోసం ఇంకుడు గుంతల కార్యక్రమంలో ప్రతి నివాస సముదాయలు తమ కర్తవ్యంగా భావించి భాగస్వామ్యం అవసరమని చెప్పారు.
ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత….
నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతూనే ఉంది. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య సముదాయలతోపాటు ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాలన్నింటిని కాంక్రీట్‌తో కప్పేస్తుండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేక భూగర్భజలాలు అడిగంటిపోతున్నాయి. ఫలితంగా తాగు నీటి కంటే నిత్యావసరాల నీటికోసం ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోంది.
హైదరాబాద్‌లో ప్రతి ఏటా సగటున 85 నుంచి 89 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతోంది. ఇందులో కేవలం 0. 75 నుంచి 0.95 శాతం మాత్రమే నేలలోకి ఇంకడం మిగితాది వరద రూపంలో మురుగు కాల్వలో కలిసి వృధాగా పోవడం సర్వసాధారణమైంది.
గత ఏడాది జలమండలి ఎండీ…. క్షేత్ర స్థాయిలో పర్యటించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా డిమాండ్‌కు గల వాస్తవ పరిస్ధితిపై ఆరా తీశారు. గృహా సముదాయాల్లో ఎండిపోతున్న బోర్లుగా ప్రధాన సమస్యగా గుర్తించారు. పాతాళంలోకి పడిపోతున్న భూగర్భజలాల పెంపుపై కోసం ప్రత్యేక కార్యాచరణకు దిగారు. తాగు నీటి సరఫరాతో పాటు .. నిత్యావసరాల వినియోగించే నీరు అందుబాటులో ఉండే విధంగా వర్షపునీటి సంరక్షణకు నడుం భిగించారు. అందులో భాగంగా నల్లా కనెక్షన్ క్యాన్ నెంబర్ ఆధారంగా సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా 20 కంటే ఎక్కువ ట్యాంకర్లను బుక్ చేసుకునే ప్రాంగణాలను గుర్తించింది.
ఇప్పటికే సుమారు 40 వేల పైగా క్యాన్ నెంబర్లను గుర్తించి 40,209 నివాససముదాయలపై సర్వే నిర్వహించారు. కేవలం 22,825 నివాసాల్లో నే ఇంకుడు గంతలు ఉన్నట్లు,17,384 నివాసాల్లో ఇంకుడు గుంతలు లేనట్లు బహిర్గతమైంది. దీంతో ఇప్పటివరకు16 వేల గృహాలకు నోటీసులు చేసి ఇంకుండు గుంత నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టింది. మరో 25 వేల గృహాలకు వచ్చే మార్చి నాటికీ ఇంకుగుంతలు చేపట్టేలా కార్యాచరణ రూపకల్పన చేసింది.
వర్షపు నీటి సంరక్షణలో భాగంగా 300 చదరపు మీటర్ల గల ప్రతి ఇంటా భూగర్భ జలాలను రీస్టోర్ చేసుకునే దిశగా ప్రాంగణంలో ఇంకుడుగుంత తప్పని సరి చేస్తూ జలమండలి చర్యలు చేపట్టింది. పాత, కొత్త నివాస, వాణిజ్య సముదాయాలపై దృష్టి సారించింది. భూగర్భజలాల పెంపు కోసం ప్రజా స్థలాలో ఇంకుడు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రజా స్థలాలు,కాలనీలు,ప్రభుత్వ సముదాయాలు, విద్యా సంస్ధలు,రోడ్డు పక్కన గల నివాస, వాణిజ్యసముదాయల రూఫ్ టాప్ నుండి కిందికి పడే వర్షపు నీటిని పైపుల ద్వారా సంరక్షణ కోసం ప్రజా ఇంకుడు గుంతల ఏర్పాటుకు సిద్దమైంది. అలాగే నిరుపయోగంలో ఉన్న బోరు బావులను హార్వెస్టింగ్ పిట్‌లతో ఇంజక్షన్ బోర్‌వెల్‌గా మార్చాలని నిర్ణయించింది.
వీటితోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గెటెడ్ కమ్యూనిటీలు, బహు అంతస్తుల భవన సముదాయాల్లో కమ్యూనిటీ ఇంకుడు గంత ఏర్పాటు చేసుకునే విధంగా ప్రత్యేక అవగాహన కార్యాక్రమాలు ఏర్పాటు చేయనుంది. ఓఆర్‌ఆర్ లోపల, అవతల గెటెడ్ కమ్యూనిటీలు, బహుళ అపార్ట్ మెంట్లను గుర్తించారు. అయా నివాస సముదాయలకు ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ ఆవశ్యకతలపై అవగాహన కల్పిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

