...
...
Next Story

'భూ భారతి' పోర్టల్ సేవలు - మీ భూమి వివరాలను ఇలా చెక్ చేసుకోండి

రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుం భూ భారతి పోర్టల్ ఆధారంగానే సేవలు అందుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ పోర్టల్ ఆధారంగా భూముల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి....

Published on: Apr 19, 2025, 06:02:19 IST
By , , Telangana
Prefer HTon Google
Advertisement

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. భూ భారతి చట్టంతో పాటు భూ భారతి పోర్టల్ కూడా ప్రారంభమైంది. భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతిపోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాల్లో మాత్రమే సేవలు ప్రారంభమయ్యాయి.

భూ భారతి పోర్టల్
భూ భారతి పోర్టల్

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో భూ భారతిసేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు సమాచార సేవలు ఉన్నాయి. లావాదేవీల విభాగంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలతో పాటు ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇక సమాచార సేవల్లో చూస్తే భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అయితే భూముల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

భూ వివరాలను ఇలా చెక్ చేసుకోండి:

  • భూమి వివరాలు తెలుసుకునేందుకు ముందుగా భూ భారతి అధికారిక పోర్టల్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే సమాచార సేవల్లోకి వెళ్లాలి. ఇక్కడ భూ వివరాలు అనే ఆప్షన్ ఉంటుంది.
  • భూ వివరాల ఆప్షన్ పై క్లిక్ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ సర్వే నెంబర్ లేదా పట్టాదారు పాస్ ఆధారంగా మీ భూమి వివరాలను తెలుసుకోవచ్చు.
  • సర్వే నెంబర్ తో చూసుకోవాలనుకుంటే జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోని చెక్ చేసుకోవచ్చు.
  • పట్టాదారుపాస్ పుస్తకంతో అయితే కేవలం పాస్ పుస్తకం నెంబర్ తో పాటు కింద ఉండే కోడ్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
  • ప్రింట్ ద్వారా భూ వివరాల కాపీని పొందవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి భూ వివరాలను నేరుగా తెలుసుకోవచ్చు….

భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తు కోసం రూ. 1000 చెల్లించాలి. స్లాట్ బుకింగ్ ద్వారానే భూ భారతిపోర్టల్ లోనూ రిజిస్ట్రేషన్లు అవుతాయి. అయితే అనుకున్న సమయానికి రాకపోతే మార్పులు చేసుకునే వీలు ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks