...
...
Next Story

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? మీ ఆధార్ నెంబర్ తో ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురికి కార్డులు రాగా... చాలా మందివి వెరిఫికేషన్ దశలో ఉన్నాయి. అయితే దరఖాస్తుదారులు... వారి అప్లికేషన్ స్టేటస్ ను ఆధార్ కార్డు నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి...

Published on: May 19, 2025, 05:00:06 IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

కొన్నిసార్లు సాంకేతిక సమస్యలతో వెబ్ సైట్ లో Uid నెంబర్ ఆప్షన్ డిస్ ప్లే కావటం లేదు. ఇలాంటి సమయంలో మీసేవాలోదరఖాస్తు చేసుకున్న సమయంలో పొందే అప్లికేషన్ నెంబర్ ను ఎంట్రీ చేసి కూడా స్టేటస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ రేషన్ కార్డు నెంబర్ తో కూడా చెక్ చేసుకునే వీలు ఉంది. అప్లికేషన్ స్టేటస్ ఆధారంగా... కొత్త రేషన్కార్డు జారీ ప్రక్రియ లేదా మార్పులు, చేర్పులకు సంబంధించి ఓ అవగాహనకు రావొచ్చు. అధికారిక వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్టేటస్ వివరాలు అందుబాటులో లేకపోతే స్థానిక మండల ఆఫీసులను సంప్రదించవచ్చు. సంబంధిత అధికారులను అడిగి... వివరాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్రియ
తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్రియ

ఇక తెలంగాణప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలోనూ చాలా మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మొదట ఆఫ్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఆ తర్వాత... మీసేవా ద్వారా కూడా స్వీకరించాలని నిర్ణయించింది. చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా మీసేవాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రజాపాలనతో దరఖాస్తు చేసుకున్న వాళ్లు.. మీసేవాలో చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చింది.

ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను కూడా ఆన్ లైన్ చేశారు. వీరిలో అర్హులను గుర్తించి... కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు. ఇక మీసేవా ద్వారా సేకరించే దరఖాస్తులను కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి... దరఖాస్తుదారుడు అర్హుతైనే కొత్త కార్డును మంజూరు చేస్తున్నారు.

కొత్త రేషన్ కార్డుల స్టేటస్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులతో మార్పులు, చేర్పులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన వారికి కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు. అయితే దరఖాస్తుదారులు.... వారి అప్లికేషన్ స్టేటస్ చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం మీసేవా నెంబర్ మాత్రమే కాకుండా ఆధార్ తో కూడా చెక్ చేసుకునే వీలు ఉంది.

ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డు స్టేటస్ - ప్రాసెస్ ఇలా

  1. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే FSC సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డ్స్ సెర్చ్ అని కనిపిస్తుంది.
  3. ఇక్కడ క్లిక్ చేస్తే FSC సెర్చ్ ,FSC అప్లికేషన్ సెర్చ్, రిజిక్టెడ్ రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
  4. FSC అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేసి ముందుగా జిల్లాను ఎంచుకోవాలి. ఇక్కడ మీసేవా నెంబర్ తో పాటు అప్లికేషన్ నెంబర్ కనిపిస్తాయి. అంతేకాకుండా చివర్లో Uid No అని ఉంటుంది.
  5. Uid No అంటే దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe