Hyderabad : ఆహార కల్తీని 'హత్యాయత్నం'గానే పరిగణిస్తాం - సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆహార కల్తీపై కఠిన వైఖరితో ముందుకెళ్లాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహార కల్తీ నిరోధానికి పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు నగర సీపీ సజ్జనార్  ప్రకటించారు.

Published on: Jan 8, 2026, 15:02:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై నగర పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జానర్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు.

పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారుల స‌మావేశం
పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారుల స‌మావేశం

ఆహార క‌ల్తీని నిరోధించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సీపీ సజ్జనార్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే 'హత్యాయత్నం'గానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్'ను రూపొందించి.. అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.

ఆహార కల్తీ నియంత్రణలో క్షేత్రస్థాయి సవాళ్లు, చేపట్టాల్సిన చర్యలపై పోలీసు, ఆహార భద్రత అధికారులతో సీపీ సజ్జనార్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని.. కల్తీ నివారణకు ఎస్‌వోపీ రూపొందించి, అమలు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్‌ చేయడం, అరెస్టుల ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామన్నారు.

వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్‌ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకువస్తున్నట్లు సీపీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More