Hyderabad Crime : పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రేమికురాలి హత్య - గోనె సంచిలో శవం..!

Hyderabad Balapur Murder Case : హైదరాబాద్‌లోని బాలాపూర్ పరిధిలో దారుణ సంఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు 21 ఏళ్ల యువతిని ప్రేమికుడు దారుణంగా పొడిచి హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పరారయ్యాడు.

Published on: Aug 17, 2026, 10:44:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad Balapur Murder Case : హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఉదంతం కలకలం రేపింది. వివాహం విషయమై తలెత్తిన తీవ్ర వివాదం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. ప్రేమించిన యువతే పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ఒక యువకుడు ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం (ఆగస్టు 17) వెలుగుచూసింది.

హైదరాబాద్‌లో దారుణం Representative Image
హైదరాబాద్‌లో దారుణం Representative Image

హత్యకు గురైన యువతిని బీహార్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల రేహానాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల అహ్మద్ సలామ్‌గా తేల్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

సోమవారం ఉదయం నిందితుడు నివాసం ఉంటున్న గదిలో నుంచి అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచిని గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు.

బాలాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో డయల్ 100 ద్వారా ఒక బెడ్‌రూమ్‌లో గోనె సంచిలో మృతదేహం ఉందనే కాల్ వచ్చింది. మా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని బీహార్‌కు చెందిన రేహానా (21)గా, నిందితుడిని అహ్మద్ సలామ్ (21)గా గుర్తించాం," అని పోలీసు అధికారి వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. "వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. త్వరగా పెళ్లి చేసుకోవాలని రేహానా అతడిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అహ్మద్ సలామ్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో దూర్చి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం" అని పోలీసులు వివరించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More